ఉదయం తొందరగా నిద్రలేచే అలవాటు చాలా తక్కువ మందికే ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్లు తప్ప.. మగవారు పొద్దు పొద్దున్నే లేచే దాకలాలు చాలా అంటే చాలా తక్కువ. ఇక పిల్లలైతే ఇంకొంచెం సేపు ఇంకొంచెం సేపు అంటూ 9, 10 కి నిద్రలేస్తుంటారు. కానీ ఈ అలవాటు మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మీకు తెలుసా? రాత్రి తొందరగా నిద్రపోయి, ఉదయం తొందరగా నిద్రలేస్తే ఇంటి పనులు తొందరగా అయిపోవడంతో పాటుగా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజానలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే మన శరీరంలో కొన్ని సానుకూల మార్పులు వస్తాయి. అసలు ఉదయం 5 గంటలకే నిద్రలేస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేస్తే వ్యాయామం చేసే సమయం మీకు ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. అలాగే మీ శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా కూడా ఉంటుంది.
మీరు ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేస్తే మీ వ్యక్తిగత ఎదుగుదలను మీరు పూర్తిగా ఆస్వాదించొచ్చు. అంటే ఉదయం లేచిన తర్వాత హోం వర్క్ చేసుకోవడం, బుక్స్, పేపర్స్ చదవడం చేయొచ్చు. ఇది మీ తెలివితేటలకు పదును పెడుతుంది. మీకు నాలెడ్జ్ ను కూడా పెంచుతుంది.
ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేస్తే ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య మీరు బ్రేక్ ఫాస్ట్ ను తినొచ్చు. ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైన పోషకాలు కూడా బాగా అందుతాయి. దీంతో మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు రాత్రిపూట టీవీ, మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి. లేదా తగ్గించాలి. అప్పుడే మీరు రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం తొందరగా నిద్రలేస్తారు.
చాలా మంది రాత్రిపూట చాలా లేట్ గా నిద్రపోతారు. దీంతో ఉదయం చాలా లేట్ గా నిద్రలేస్తారు. దీనివల్ల మీరు లేట్ గా బ్రేక్ ఫాస్ట్ ను తింటారు. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒకవేళ మీరు ఉదయం 5 గంటలకే నిద్రలేచారంటే ఎంచక్కా టైం కి బ్రేక్ ఫాస్ట్ ను తింటారు.