రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Jun 9, 2024, 3:40 PM IST

బయటకు వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాళ్లు కడుకునే ఇంట్లోకి రావాలని పెద్దలు చెప్తుంటారు. ఇలా చెప్పడం వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం.. రాత్రి పడుకునే ముందు కాళ్లు కడితే ఏమౌతుందో తెలుసా?


నమ్మకాల ప్రకారం.. తినడానికి ముందు, బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చేటప్పుడు, నిద్రపోయే ముందు కాళ్లను కడగాలి. ఎందుకంటే ఇది మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుందని నమ్ముతారు. ఈ అలవాటు శరీరాన్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పడుకునే ముందు కాళ్లను ఎందుకు కడగాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

పాదాలు కడుక్కునే సంప్రదాయం 

హిందూమతంలో..  మనం దేవుడి గుడిలోకి వెళ్లడానికి ముందు ఖచ్చితంగా కాళ్లను కడుక్కుంటాం. ఇది ఎన్నో కారణాల వల్ల ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇలా కాకుండా రాత్రిపడుకునే ముందు పాదాలను కడుక్కోవడం కూడా తప్పనిసరిగా భావిస్తారు.


నిద్రపోయే ముందు పాదాలను ఎందుకు కడుక్కోవాలి?

రాత్రి పడుకునే ముందు కాళ్లను కడుక్కోవాలని పెద్దలు చెప్పడం వినే ఉంటారు. దీనికి ఒక కారణం ఉంది. నిద్రపోయే ముందు పాదాలను కడుక్కోవడం వల్ల బ్యాక్టీరియా ఇంట్లోకి ప్రవేశించదని నమ్ముతారు. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

శరీరానికి శక్తి 

రోజంతా కష్టపడి పని చేసిన తర్వాత రాత్రిపూట పాదాలను కడుక్కుంటే శరీరానికి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. ఇది పాదాల అలసటను తొలగించి మన శరీరానికి శక్తిని అందిస్తుంది.
 

మానసిక భావోద్వేగాల నియంత్రణ 

మానసిక ఆరోగ్యం బాగుండాలంటే మానసిక భావోద్వేగాల నియంత్రణ కూడా చాలా అవసరం. అయితే మీరు రాత్రి పడుకునే ముందు పాదాలను కడుక్కోవడం వల్ల కూడా మానసిక భావాలను నియంత్రించుకోవచ్చని నమ్మకం ఉంది. ఈ కారణంగా పాదాలను కడుక్కోవడం మంచిదని చెప్తారు.
 

బ్యాక్టీరియా

శాస్త్రీయ కారణాల ప్రకారం.. రాత్రిపూట పాదాలను కడగడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా శుభ్రపడుతుంది. ఇది మన పాదాల నుంచి శరీరంలోకి ప్రవేశించగలదు. ఈ కారణంగా పాదాలను రాత్రిపూట కడగాలని చెప్తారు. 

సరైన శరీర ఉష్ణోగ్రత

శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవాలంటే రాత్రి పడుకునే ముందు పాదాలను ఖచ్చితంగా కడుక్కోవాలంటారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట పడుకునే ముందు పాదాలను కడగడం వల్ల నిద్ర కూడా మెరుగ్గా పడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. 

రోగాలకు దూరంగా

రాత్రిపూట పాదాలు కడుక్కుని నిద్రపోవడం వల్ల పాదాలకు పట్టిన మురికి తొలగిపోతుందని నమ్ముతారు. ఇది శరీరాన్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే రాత్రిపడుకుని నిద్రపోవడం మంచిదని అంటారు.

Latest Videos

click me!