హీరో ధనుష్ లగ్జరీ హౌస్ .. విలువ రూ.150కోట్లు..!

First Published | Jun 29, 2021, 2:32 PM IST

ఈ ఇంటి కోసం ధనుష్ దాదాపు రూ.150కోట్లు ఖర్చు చేయనట్లు సమాచారం. ఈ ఇల్లు.. రజినీకాంత్ ఇంటికి సమీపంలోనే నిర్మించడం గమనార్హం.

తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి తెలియని తెలుగు వారు ఉండరు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. ఇక్కడ కూడా ఆ సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆయన తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు.
కాగా.. ఈ స్టార్ హీరో ఈ ఏడాది ఫిబ్రవరిలో చెన్నైలో పోయెస్ గార్డెన్ లో భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి కి పూజను తన భార్య ఐశ్వర్య, మామగారు సూపర్ స్టార్ రజినీకాంత్, అత్తగారు లలిత కలిసి నిర్వహించారు.

ఈ ఇంటి కోసం ధనుష్ దాదాపు రూ.150కోట్లు ఖర్చు చేయనట్లు సమాచారం. ఈ ఇల్లు.. రజినీకాంత్ ఇంటికి సమీపంలోనే నిర్మించడం గమనార్హం.
స్థానిక ఓ మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఇంటిని ధనుష్ దాదాపు 19000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్థులుగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ధనుష్.. నెట్ ఫ్లెక్స్ లో విడుదల కానున్న సినిమా గ్రే మ్యాన్ షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్నారు. కాగా.. త్వరలోనో డైరెక్టర్ కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటించేందుకు మళ్లీ భారత్ రానున్నారు.
ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం అట్రాంగి రే లో కూడా ధనుష్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన సారా అలీ ఖాన్ నటించారు. ఈ చిత్రంలో నటుడు అక్షయ్ కుమార్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు.
ధనుష్ తాజా చిత్రం జగామే తందిరామ్ విమర్శకులు, ప్రేక్షకుల నుండి మంచి రివ్యూస్ అందుకున్నారు. ఈ చిత్రం జూన్ 18 న నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమ్ అయ్యింది.. ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలో జేమ్స్ కాస్మో కీలక పాత్రలో నటించారు.

Latest Videos

click me!