ఒలింపిక్స్ 2024: సినీ స్టార్స్ ని తలదన్నేలా మన అథ్లెట్స్ .. అబ్బబ్బా ఏమున్నారు..!

First Published | Aug 1, 2024, 11:27 AM IST

 మన దేశం నుంచి  దాదాపు 117మంది అథ్లెట్స్... 16 వివిధ రకాల గేమ్స్ లో పోటీపడతానికి రెడీ అయ్యారు.  మొత్తం 70 మంది పురుషులు, 47 మంది స్త్రీలు ఈ పోటీలో ఉండటం గమనార్హం.
 

పారిస్ ఒలింపిక్స్ చాలా ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిధ దేశాలకు చెందిన  అథ్లెట్లు... తమ టాలెంట్ ని ప్రపంచానికి చూపిస్తూ... ఆకట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఒలింపిక్స్ లో దాదాపు 206 దేశాలు తలపడుతున్నాయి. 206 దేశాల నుంచి దాదాపు 14, 250 మంది  అథ్లెట్స్  పోటీపడుతున్నారు. మన దేశం నుంచి  దాదాపు 117మంది అథ్లెట్స్... 16 వివిధ రకాల గేమ్స్ లో పోటీపడతానికి రెడీ అయ్యారు.  మొత్తం 70 మంది పురుషులు, 47 మంది స్త్రీలు ఈ పోటీలో ఉండటం గమనార్హం.

నార్మల్ అథ్లెట్స్ అంటే వారు ఆడే ఆట మీద తప్ప, తమ ఫిజిక్ మీద మాత్రమే ఫోకస్ పెడతారని అనుకుంటారు.. కానీ... కొందరు అథ్లెట్స్ మాత్రం స్టైల్ కి ఐకాన్ గా మారడం గమనార్హం.  ఎంతలా అంటే... హీరో, హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా... ఈ అథ్లెట్స్ ఉన్నారు అనడంలో  ఎలాంటి సందేహం లేదు.  మరి.. మన దేశానికి చెందిన  ఆ స్టైలిష్ అథ్లైట్స్ ఎవరో.. ఏంటో ఓ లుక్కేద్దామా...


1.మను భాకర్...
మనుభాకర్.. ఇండియన్ షూటర్.  ఈ ఒలంపిక్స్ లో ఆమె భారత్ తరపున పోటీపడుతున్నారు. కాగా.. ఆమె షూటర్ గా మాత్రమే కాదు...  స్టైల్ ఐకాన్ అని కూడా చెప్పొచ్చు. రీసెంట్ గా ఆమె... వెస్ట్రన్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. సింపుల్  ప్రాక్  అయినా.. ఆమె ఆ లుక్ లో చాలా స్టైలిష్ గా కనపడటం విశేషం. మరోవైపు మోడ్రన్ ట్విస్ట్ ఇవ్వడం విశేషం. మరో ఫోటోలో ఆమె సింపుల్ కుర్తీలో కూడా కనిపించి ఆకట్టుకున్నారు.
 

2.నీరజ్ చోప్రా...
భారత జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రాకి అసలు పరిచయం అవసరం లేదు. 2020 ఒలంపిక్స్ విజేత గా అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే.. నీరజ్.. ఆటకు ఎంత  మంది ఫ్యాన్స్ ఉన్నారో... ఆయన స్టైల్ కి కూడా అంతే ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. తన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ కి చాలా క్రేజ్ ఉంది,  నీరజ్ ఎక్కువగా... హుడీలు ధరిస్తూ ఉంటాడు.  రీసెంట్ గా... కార్డ్ సెట్ ధరించాడు.

Akshdeep Singh

3.అక్షదీప్ సింగ్..
మరో అథ్లెట్ అక్షదీప్ సింగ్.  ఈ స్పోర్ట్స్ హీరో  అక్షదీప్ సింగ్  కూడా.. స్టైల్ ఐకాన్ అని చెప్పొచ్చు. సింపుల్ గా కనపడుతూనే.... ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటాడు. తన రీసెంట్ ఫోటోలే అందుకు సాక్ష్యం.


4.ప్రియాంక గోస్వామి..
రేస్ వాకర్ ప్రియాంక గోస్వామి కూడా.. స్టైల్ ఐకాన్  అని చెప్పొచ్చు. రీసెంట్ గా ఆమె స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది.  రీసెంట్ గా.. వైట్ ఫ్లోరల్ ప్రింట్ క్రాప్ టాప్, బూట్ కట్ జీన్స్ లో దర్శనిమిచ్చింది. ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. చీరలోనూ అప్పుడప్పుడు మెరిపిస్తూ ఉంటుంది.
 

5.అంతిమ్ పంఘల్...
హర్యానాకు చెందిన మహిళా రెజ్లర్ ఈ అంతిమ్ పంఘల్.  రీసెంట్ గా ఆమె అర్జున అవార్డు కూడా గెలుచుకున్నారు. ఆ సమయంలో ఆమె గోల్డెన్ బోర్డర్ ఉన్న  రెడ్ కలర్ శారీ ధరదించారు. దాని మీద మెరూన్ కలర్ బ్లేజర్ ధరించారు. ఆ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపించడం విశేషం.

6.చిరాగ్ శెట్టి..
బ్యాడ్మింటన్ ప్లేయర్ చిరాగ్ శెట్టికి కూడా పరిచయం అవసరం లేదు.  కాగా.. చిరాగ్ కూడా అప్పుడప్పుడు స్టైల్  ఐకాన్ గా మారిపోతూ ఉంటారు. రీసెంట్ గా బ్లాక్ జాకెట్, శేర్వాని ధరించి స్పెషల్ లుక్ లో ఎట్రాక్ట్ చేశాడు.

Latest Videos

click me!