గూగుల్ సెర్చ్ లో టాప్... వర్జిన్ వధువే కావాలి

First Published | Sep 17, 2019, 1:19 PM IST

ఇప్పటికీ అబ్బాయిలు తమకు వర్జిన్ అమ్మాయే భార్యగా రావాలని కోరుకుంటున్నారట. అక్కడితో ఆగడం లేదు. నిజంగా అమ్మాయి వర్జినో కాదో ఎలా తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారని ఓ సర్వేలో తేలింది.

పెళ్లికి ముందు అమ్మాయి కి ఎవరితోనైనా శారీరక సంబంధం ఉందా..? నిజంగా కన్యేనా అని తెలుసుకోవాలని నేటి తరం యువకులు తెగ అత్యుత్సాహం చూపిస్తున్నారట. ఒకప్పుడు ఇలాంటి పరీక్షలు నిర్వహించేవారు.
తొలిరాత్రి తర్వాత రక్తపు మరకలు ఉన్నాయా లేదా అని కూడా పరీక్షించేవారు. దీనిపై చిన్నపాటి వ్యతిరేకత కూడా వ్యక్తమయ్యింది. ఇప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి.

అయితే.... చాలా ప్రాంతాల్లో ఈ విషయంలో మార్పు వచ్చింది. అమ్మాయిలకు పెళ్లికి ముందు కన్యత్వ పరీక్షలు నిర్వహించడం ఆపేశారు. నమ్మకంతోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే అంటున్నారు నిపుణులు. టెక్నాలజీ మారుతున్నప్పటికీ... అందరూ విద్యావంతులు అవుతున్నప్పటికీ... పురుషుల్లో వర్జినిటీ మీద ఉన్న అభిప్రాయం మారడం లేదని తాజాగా తేలింది.
ఇప్పటికీ అబ్బాయిలు తమకు వర్జిన్ అమ్మాయే భార్యగా రావాలని కోరుకుంటున్నారట. అక్కడితో ఆగడం లేదు. నిజంగా అమ్మాయి వర్జినో కాదో ఎలా తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారని ఓ సర్వేలో తేలింది.
వర్జినిటీ టెస్ట్ ఫర్ విమెన్, వర్జినిటీ టెస్ట్ ఫర్ ఫీమేల్, ఇంట్లోనే వర్జినిటీ టెస్ట్ ఎలా చేయడం? తదితర కీ వర్డ్‌లను ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు వెల్లడైంది. వధువు పెళ్లికి ముందు శారీరక సంబంధం పెట్టుకుందో లేదో తెలుసుకునేందుకు ఇలాంటివి చెక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వధువు వర్జిన్ అయితే అదృష్టవంతులమని పెళ్లి కుమారులు భావిస్తున్నట్లు అధ్యయనం పేర్కొనడం గమనార్హం.
కాగా, మహారాష్ట్రలోని కంజార్‌భట్ తెగతో పాటు మరికొన్ని సమూహాల్లో కన్యత్వ పరీక్షల ఆచారం కొనసాగుతుంది. పెళ్లయిన తరువాత తొలిరాత్రి వధువుకు కన్యత్వ పరీక్ష చేసే ఆచారం ఉంది. నవదంపతులు తొలి రాత్రి గడిపిన తరువాత వారి పడకపై ఉన్న దుప్పటిపై రక్తం మరక ఉందో లేదో చూసి పెళ్లికూతురు కన్యో కాదో నిర్ణయిస్తారు.
మనదగ్గరే కాదు.. ఆర్మేనియా, జార్జియాతో పాటు, నార్త్ కాకసస్‌లో ఇలాంటి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. శోభనం జరిగిన తెల్లారి బెడ్‌షీట్‌ మీద మరకలను గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పరిశీలిస్తారు. ఈ సంప్రదాయాన్ని అక్కడ రెడ్ యాపిల్ అంటారు.
ఇలాంటి చర్యలను మానక హక్కుల కార్యకర్తలు వ్యతిరేకిస్తూ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఫలితం నామమాత్రంగానే ఉంటోంది.

Latest Videos

click me!