పాలు, అరటిపండు.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిదో తెలుసా?

First Published | Nov 12, 2024, 1:22 PM IST

పాలు, అరటిపండు.. రెండింటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అయితే ఈ పాలు, అరటిపండులో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో తెలుసా?

ఆరోగ్యంగా ఉండటం కోసం మనం ఎన్నో చేస్తుంటాం. హెల్తీ ఫుడ్ ను తినడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం లాంటివి చేస్తుంటాం. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ హెల్తీ ఫుడ్ ను తింటే మనకు ఎలాంటి జబ్బులు రావు. ఈ హెల్తీ ఫుడ్ లీస్ట్ లో అరటిపండ్లు, పాలు కూడా ఉన్నాయి. 

నిజానికి అరటి పండ్లు, పాలు రెండింటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కొందరు పాలు ఆరోగ్యానికి ఎక్కువ మంచివని చెప్తే.. మరికొందరు పాలని చెప్తారు. మరి అరటిపండ్లు, పాలు రెండింటిలో మన ఆరోగ్యానికి ఏది ఎక్కువ మంచి చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

అరటి పండును తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలు అరటిపండులో పుష్కలంగా ఉంటాయి. అరటి పండులో డైటరీ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా దీనిలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. 

ఇకపోతే ఒక అరటిపండులో 2.6 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మన శరీరం పేరుకుపోయిన విష పదార్థాలను, వ్యర్థాలను బయటకు పంపడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

అరటిపండులో కూడా పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీరు హెవీగా భోజనం చేయడాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే  గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడానికి కూడా ఇది సహాయపడుతుంది.

అరటి పండును మోతాదులో తింటే మీరు ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. ఫైనల్ గా అరటి పండు చౌకైన పండు మాత్రమే కాదు.. టేస్టీగా, ప్రతి సీజన్ లో దొరుకుతుంది. వీటిని తినడం కూడా చాలా ఈజీ. అందుకే వీటిని పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి  ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. 


పాలను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

రోజూ ఒక గ్లాస్ గోరువెచ్చని పాలను తాగడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. అందుకే ఈ రోజుల్లో చాలా మంది ఆహారంలో పాలు ఒక భాగమైపోయింది. పాలలో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను, కండరాలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి.

అంతేకాదు పాలలో ఉండే ప్రోటీన్లు మన శరీరం తన విధులను సక్రమంగా చేయడానికి హార్మోన్లను నియంత్రించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. కొవ్వు తక్కువగా ఉండే పాలను తాగితే మీరు బరువు పెరిగే అవకాశం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

పాలు డయాబెటీస్ పేషెంట్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పాలు తాగితే అధక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాదు పాలు తాగితే జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

పాలు, అరటి పండ్లలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే?

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పాలు, అరటిపండ్లు రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ రెండూ మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. కాబట్టి మీ వ్యక్తిగత ప్రాధాన్యతలు, ఇష్టాలు, అనారోగ్య సమస్యలను బట్టి ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని లేదా రెండింటినీ తీసుకోవచ్చు. కానీ మోతాదుకు మించి తింటే మాత్రం సమస్యలు వస్తాయి. 

పాలలో అరటిపండ్లను వేసుకుని తినడం వల్ల వచ్చే సమస్యలు

నిజానికి పాలలో అరటిపండ్లను వేసుకుని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు సమస్యలు కూడా వస్తాయి. అసలు ఈ కాంబినేషన్ వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఖనిజాలు, విటమిన్లు లేకపోవడం

ప్రెగ్నెన్సీ, పీరియడ్స్ టైంలో ఆడవాళ్లకు జింక్, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు అవసరమవుతాయి. కానీ పాలు, అరటి కాంబినేషన్ లో ఇవి ఉండవు. కాబట్టి మీరు ఇలాంటి సమయంలో ఈ కాంబినేషన్ పై ఆధారపడకపోవడమే మంచిది.

బరువు పెరుగుతారు 

మీకు తెలుసా? పాలలో అరటిపండును వేసుకుని తింటే మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు గనుక బరువు తగ్గాలనుకుంటే మాత్రం పాలలో అరటిపండును వేసుకుని తినడం మానేయండి. ఎందుకంటే పాలు, అరటిపండ్లు రెండింటిలో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కానీ బరువు పెరగాలనుకునేవారికి మాత్రం ఈ కాంబినేషన్ ప్రయోజనకరంగా ఉంటుంది. 

అలెర్జీ ఉన్నవారు

అలెర్జీ ఉన్నవారు ఎట్టి పరిస్థితిలో పాలలో అరటిపండును వేసి తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది సమస్యను మరింత పెంచుతుంది. అలెర్జీ ఒక్కటే కాదు. శ్వాస సంబంధిత సమస్యలు, ఉబ్బసం ఉన్నవారు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయకూడదు. 

Latest Videos

click me!