Holi 2022: హోలీ గురించి మీకు ఈ ముచ్చట ఎరుకేనా..

First Published | Mar 12, 2022, 2:05 PM IST

Holi 2022:  చిన్నలు, పెద్దలు అంటూ ఎలాంటి తారతమ్యం లేకుండా ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే హోలీ పండుగ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. 

Holi 2022: తెలుగు సంవత్సరాదిలో వచ్చే చివరి నెల ఫాల్గుణ మాసంలోనే హోలీ పండుగ వస్తుంది. ఈ పండుగ వసంత కాలంలో వస్తుంది కాబట్టి దీన్ని ‘వసంతోత్సవం’ అని కూడా అంటారు. మన దేశంలో దీపావళీ తర్వాత వచ్చే పండుగల్లో హోలీనే ఘనంగా జరుపుకుంటారు. 
 

హొలీని కాముని పున్నమి, హోలికా పూర్ణిమ, డోలికోత్సవం అని కూడా పిలుస్తారు. మరి ఈ పండుగ ప్రతి ఏడాది వస్తూనే ఉంటుంది. అయితే పండుగ పుట్టు పూర్వోత్తరాలు ఎంత మందికి తెలుసు.. పురాణాల ప్రకారం.. ఈ పండుగ పుట్టుపూర్వోత్తరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.. 


ఇదీ కథ.. రాక్షసుల రాజైన హిరణ్యాకశపుని కొడుకు భక్త ప్రహ్లాదుడు. భక్త ప్రహ్లాదునికి విష్ణుమూర్తంటే అమితమైన ఇష్టం..ఈ దేవుడిని నిత్యం పూజిస్తూ.. విష్ణునామమే జపిస్తూ  ఉండే వాడు. ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పూజించడం అతని తండ్రి హిరణ్యాకశ్యపుడికి అస్సలు నచ్చదు. విష్ణుమూర్తిని పూజించొద్దని ఎన్నో విధాల చెప్పి చూస్తాడు. అయినా ప్రహ్లాదుడు ఆ విష్ణుమూర్తినే పూజిస్తుంటాడు. దాంతో కోపోద్రిక్తుడైన హిరణ్యాకశపుడు కొడుకును చంపదలచుకుంటాడు. అందుకు తన చెల్లి హోళిక సాయం తీసుకుంటాడు.
 

holi 2022

దాంతో హోళిక ప్రహ్లాదున్ని తన ఒడిలోకి తీసుకుని పెద్ద మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణు మాయంతో ఆ మంటల నుంచి ప్రహ్లాదుడు ఆ మంటల నుంచి క్షేమంగా బయటపడతాడు. కానీ హోలిక మాత్రం పూర్తిగా మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోతుంది. మంటల్లో హోలిక చనిపోయిన రోజునే మనం హోలీని జరుపుకుంటున్నామని పురాణాల్లో ఉంది. అందుకే మన దేశంలోని కొన్ని ప్రాంతాలల్లో ‘హోలిక దహనం’ ఏర్పాటు చేస్తుంటారు. 
 

హోలీని డోలోత్సవం అనికూడా అంటారు. అయితే ఈ డోలోత్సవం వంగదేశంలో సెలబ్రేట్ చేసుకుంటారు. హోలీ రోజున  శ్రీకృష్ణ పరమాత్ముడు  బృందావనం గోపికలతో చేరి రంగులు, పువ్వులు రంగులతో ఈ హోలీ పండుగను జరుపుకున్నట్టుగా పురాణాల్లో ఉంది. ఆ రోజున పువ్వులను, రంగులను ఒకరిపై ఒకరు జల్లుకోవడం వల్ల సౌభాగ్యాలు, అనుబంధాలు, ప్రేమలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు. 

పశ్చిమ బెంగాల్ ల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో పెట్టి ఊరంగా ఘనంగా ఊరేగిస్తుంటారు. డోలిక అంటే కూడా ఉయాల అనే అర్థం. అక్కడ ఈ పండుగను డోలికోత్సవం అంటారు. హోలీ పండుగ పర్వదినాన రాధను ఊయలలో కూర్చోబెట్టి ఆమెపై పూలు, రంగులు శ్రీకృష్ణుడు గుప్పినట్టు కూడా కొందరు చెబుతుంటారు. 

Latest Videos

click me!