వాషింగ్ మెషిన్ లేకున్నా.. దుస్తులను చాలా ఫాస్ట్ గా ఎలా ఉతకొచ్చో తెలుసా?

First Published | Aug 10, 2024, 4:22 PM IST

ఇంటి పనులను చేసే సరికే ఆడవాళ్లకు చాలా టైం అవుతుంది. ఇక వాషింగ్ మిషన్ లేని ఇంట్లో దుస్తులను ఉతకడమంత కష్టం మరేదాంట్లో ఉండదు. అందుకే వాషింగ్ మెషిన్ లేని వారు ఒకరోజు మొత్తం దుస్తులను ఉతకాడానికే కేటాయిస్తారు. కానీ మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే గనుక వాషింగ్ మెషన్ లేకున్నా నిమిషాల్లో దుస్తులను ఉతకొచ్చు. అదెలాగంటే? 
 

దుస్తులను ఉతకడం ఒక ముఖ్యమైన పనే. కానీ అంతకంటే చాలా కష్టమైన పనికూడా. చాలా మందికి రోజూ దుస్తులను ఉతుక్కునే అలవాటు ఉండదు. వారానికి ఒక్కసారి మాత్రమే ఉతుకుతుంటారు. ఇంకేముంది ఉతకని దుస్తులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతాయి. వీటిని వాషింగ్ మెషిన్ లేకుండా ఉతకాలంటే రెండు రోజులైనా పడుతుందని అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఒక్క రోజులో వారం రోజుల దుస్తులను ఉతకడం చాలా కష్టమైన పని. ఎంత తొందర తొందరగా ఉతికినా.. వీటిని ఉతకడానికి కనీసం సగం రోజైనా పడుతుంది. అది కూడా వాషింగ్ మెషిన్ లో వేస్తే. మరి వాషింగ్ మెషిన్ లేని వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి  వాషింగ్ మెషిన్ లేనివారు ఈజీగా, తొందరగా దుస్తులను ఎలా ఉతకాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

దుస్తులను ఎంచుకోండి

దుస్తులు ఉతకడం తొందరగా అయిపోవాలంటే మాత్రం మీరు ముందుగా ఉతకాలంటున్న వాటన్నింటినీ ఒకచోట పెట్టండి. అలాగే రంగు పోయే వాటిని సపరేట్ చేయండి. అలాగే వైట్ దుస్తులను సపరేట్ గా చేసి పెట్టండి. దీనివల్ల టైం చాలా ఆదా అవుతుంది. ఆ తర్వాత వేర్వేరు బకెట్లలో వేడి నీళ్లను తీసుకుని పెట్టండి. బట్టలు తొందరగా ఉతకడానికి వేడినీరు బాగా సహాయపడతాయి. 
 


నానబెట్టాలి

బట్టలను తొందరగా ఉతకాలనుకుంటే వీటిని ఖచ్చితంగా నానబెట్టాలి. బట్టలను నానబెట్టడం వల్ల వాటిలోని మురికి సులువుగా పోతుంది. ఇందుకోసం చల్ల నీళ్లలో కాకుండా.. గోరువెచ్చని నీటిలో నానబెట్టండి. మురికి బట్టలు గోరువెచ్చని నీళ్లకు బాగా క్లీన్ అవుతాయి. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో డిటర్జెంట్ ను వేసి 10 నిమిషాల పాటు దుస్తులను నానబెట్టండి. ఆ తర్వాత దుస్తులను ఒక్కొక్కటిగా తీసివేసి చేతులతో లేదా బ్రష్ తో క్లీన్ చేయండి. తర్వాత వీటిని చల్ల నీటిలో బాగా కడిగి బయటకు తీయండి. 
 


దుస్తులను ఉతికేటప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఉతకడం ఈజీ కావడంతో పాటుగా మీ టైం కూడా చాలా ఆదా అవుతుంది. అయితే బాత్రూం కూడా మురికిగా ఉంటుంది కాబట్టి.. బట్టలను ఉతకడానికి ముందే బాత్రూం ను క్లీన్ చేసి దుస్తులను వేయండి. దీనివల్ల ఉతికిన బట్టలకు మరకలు ఉంటవు. ఎప్పుడైనా సరే రంగు పోయే దుస్తులను లాస్ట్ లోనే ఉతకాలి. అలాగే వైట్ దుస్తులను, రంగురంగుల దుస్తులను సపరేట్ గా ఎండలో ఆరేయాలి.

Latest Videos

click me!