నెల రోజులు వచ్చే గ్యాస్ రెండు నెలలు రావాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Jul 10, 2024, 9:55 AM IST

వర్షాకాలంలో గ్యాస్ సిలిండర్ చాలా తొందరగా అయిపోతుంటుంది. కారణం.. రకరకాల వంటలను చేసుకుని తింటుంటాం. దీనివల్ల గ్యాస్ నెల రోజులకు మించి రాదు. కానీ మీరు గనుక కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం నెల రోజులు వచ్చే గ్యాస్ రెండు నెలలు పక్కా వస్తుంది. ఇందుకోసం ఏ చేయాలంటే? 
 

రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ ధరల పెరుగుదల వల్ల ఎంత పొదుపు చేసినా.. అవసరాలను తీర్చుకోవడం చాలా కష్టంగా మారుతుంది. అందులోనూ వానాకాలం వచ్చేసింది. ఈ సీజన్ లో అన్నీ వేడి వేడిగానే తినాలనిపిస్తుంది. చాలా మంది ఈ సీజన్ లో ఏ పూటకు ఆ పూట వండుకుని తింటుంటారు. దీనివల్ల గ్యాస్ సిలిండర్ ఒక్క నెలకు మించి ఎక్కువ రోజులు రానే రాదు. అన్నింటితో పాటుగా గ్యాస్ కు కూడా మీరు మరింత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే మీరు గనుక కొన్ని చిట్కాలను ఫాలో అయితే నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ రెండు నెలలు వస్తుంది. 
 

వర్షాకాలంలో గ్యాస్ తొందరగా ఎందుకు అయిపోతుంది? 

వర్షాకాలంలో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల వంట చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అందులోనూ ఈ సీజన్ లో ప్రతి ఒక్కరూ వేడి వేడిగానే తినడానికి ఇష్టపడతారు. కొంతమంది తక్కువ మంటపై ఎప్పుడూ వేడి చూస్తూనే ఉంటారు. కానీ దీనివల్ల గ్యాస్ తొందరగా అయిపోతుంది. ఫ్రిజ్ లో నుంచి తీసిన ఆహారాన్ని నేరుగా వేడి చేస్తుంటారు. కానీ చల్లగా ఉన్న ఆహారాన్ని వేడిచేయాలంటే ఎక్కువ గ్యాస్ అవసరమవుతుంది. ఇలాంటి సమయంలో తేమ వల్ల గ్యాస్ కూడా లీకవుతుంది. మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అయితే గ్యాస్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. గ్యాస్ లీకేజీపై దృష్టి పెడితే కూడా గ్యాస్ తొందరగా అయిపోకుండా చూసుకోవచ్చు. మరి గ్యాస్ ఎక్కువ రోజులు రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

Latest Videos


సరైన నిల్వ

గ్యాస్ సిలిండర్లను సరిగ్గా నిల్వ చేస్తే కూడా మీరు గ్యాస్ ను ఎక్కువ రోజులు వచ్చేలా చేయొచ్చు. గ్యాస్ సిలిండర్లను ఎప్పుడూ కూడా వెలుతురు వచ్చే ప్రదేశంలో నిటారుగా ఉంచాలి. ఇది గ్యాస్ లీకేజీ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే గ్యాస్ సిలిండర్ ను స్థిరంగా ఉంచుతుంది.
 


గ్యాస్ ను ఆఫ్ చేయండి

చాలా మందికి గ్యాస్ సిలిండర్ ను ఆఫ్ చేసే అలవాటు ఉండదు. కేవలం స్టవ్ దగ్గర మాత్రమే ఆఫ్ చేసేసి.. సిలిండర్ దగ్గర ఆఫ్ చేయడం  మర్చిపోతుంటారు. కానీ ఇలా ఆఫ్ చేయకపోవడం వల్ల గ్యాస్ బాగా లీక్ అవుతుంటుంది. అందుకే సిలిండర్ దగ్గర కూడా వంట అయిపోగానే ఆఫ్ చేయండి. 

సీల్ చెక్ చేయండి

చాలా మంది కొత్త గ్యాస్ సిలిండర్ కొని దాన్ని అస్సలు చెక్ చేయకుండా వాడుతుంటారు. కానీ కొత్త గ్యాస్ సిలిండర్ ను కొన్నప్పుడు ఖచ్చితంగా దాని సీల్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయాలి. దాని  రెగ్యులేటర్ సరిగ్గా లేకుంటే అది లీకయ్యే ప్రమాదం ఉంది. 

Gas

గ్యాస్ ఇగ్నిషన్

లేటెస్ట్ గ్యాస్ స్టవ్ లలో ఆటోమేటిక్ ఇగ్నీషన్ సిస్టమ్ ఉంటుంది. కానీ కొందరు ఇప్పటికీ పాత పద్ధతినే ఫాలో అవుతున్నారు. మీరు కూడా పాత పద్ధతిలో గ్యాస్ మంటను వెలిగిస్తుంటే.. మీరు గ్యాస్ ను ఆన్ చేయడానికి ముందు మంటను వెలిగించండి. దీనివల్ల గ్యాస్ వృథా కాదు. ఎందుకంటే వర్షాకాలంలో తేమ వల్ల అగ్గిపుల్లలు తొందరగా తడిసిపోయి మండవు. 
 

బియ్యాన్ని నానబెట్టండి

చాలా మంది అప్పటికప్పుడు పప్పులు, బియ్యాన్ని కడిగేసి స్టవ్ పై పెట్టేస్తుంటారు. కానీ ఇలా చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల అవి ఎక్కువ సేపు ఉడుకుతాయి. దీనికి చాలా గ్యాస్ అవసరమువుతుంది. అందుకే బియ్యాన్ని కానీ, పప్పులను కానీ ముందే నానబెట్టి ఉడికించండి. దీనివల్ల గ్యాస్ వినియోగం చాలా వరక తగ్గుతుంది. వండడానికి ముందు ధాన్యాలు, బియ్యాన్ని కొన్ని గంటలు నానబెట్టి, తర్వాత వాటిని ఉడికించడం వల్ల వర్షాకాలంలో గ్యాస్ ఆదా అవుతుంది.

మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే? ఫ్రిజ్ నుంచి బయటకు తీసిన వెంటనే స్టవ్ పై పెట్టకూడదు. దీనివల్ల అవి వేడి కావడానికి చాలా టైం పడుతుంది. దీంతో గ్యాస్ ఎక్కువ అయిపోతుంది. ఫ్రిజ్ లో నుంచి ఏ ఆహారాలను బయటకు తీసి వేడిచేయాలన్నా.. వాటిని గది ఉష్ణోగ్రత వద్దకు తీసుకురావాలి.  ఆ తర్వాతే వంట చేయాలి. ఇది వర్షకాలంలో మీ గ్యాస్ ఎక్కువ రోజులు వచ్చేలా చేస్తుంది. గ్యాస్ ను ఆదా చేయాలనుకుంటే తక్కువ మంట మీదే వేడి చేయాలి. 

click me!