డ్రెస్సులకు బురద మరకలు పోవాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Jul 27, 2024, 4:30 PM IST

వర్షాకాలంలో రోడ్డుపై నడిచేటప్పుడు బురద  డ్రెస్సుపై ఖచ్చితంగా పడుతుంది. అలాగే చీర, ప్యాంటు అంచులకు కూడా బురద అంటుకుంటుంది. ఇక ఈ బురద ఎండిపోయి మొండిగా మారుతాయి. అయితే మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం పెద్దగా కష్టపడకుండానే ఈ మరకలను పోగొట్టొచ్చు. ఎలాగంటే? 
 

వర్షాకాలంలో రోడ్డుపై నడిచేటప్పుడు చెప్పుల వల్ల బురద పడుతుంది. అలాగే ప్యాంట్, చీరలకు కూడా బురద అంటుకుంటుంది. ఈ బురద మరకలను పోగొట్టడం చాలా కష్టం. అయితే చాలా మంది ఈ మరకలు నీళ్లతో కడిగేస్తే పోతాయిలే అనుకుంటారు. అయితే బంకమట్టి మరకలు మాత్రమే నీళ్లతో పోతాయి. కానీ రోడ్డు మట్టిలో, బురదలో ఎన్నో రకాల రసాయనాలు ఉంటాయి. అందుకే దుస్తులపై ఈ బురద మరకలు అంత సులువుగా పోవు. కానీ మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం ఈజీగా పోతాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

వేడి నీళ్లు 

బురద మరకలు పోవాలంటే దుస్తులపై ఉన్న మట్టిని శుభ్రమైన క్లాత్  లేదా టిష్యూ పేపర్ తో తుడవండి. ఆ తర్వాత దాన్ని నీళ్లలో తడిపి క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల మరకలను పోగొట్టడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇలా చేయడం వల్ల దుస్తుల అంచులు మాత్రం శుభ్రం కావు. మీరు ఇలా చేసినా అంచులకు బురద మరకలు పోవాలంటే మాత్రం ఒక పాత్రలో వేడి నీళ్లను తీసుకోండి. దీనిలో డిటర్జెంట్ వేసి బాగా మిక్స్ చేసి అందులో దుస్తులను 30 నిమిషాల పాటు నానబెట్టండి. ఇప్పుడు ఈ బట్టలను మెత్తని బ్రష్ తో శుభ్రం చేయండి. 


వెనిగర్

బట్టలపై ఉన్న మట్టి మరకలను శుభ్రం చేయడానికి మీరు వెనిగర్ ను కూడా ఉపయోగించొచ్చు. ఎక్కడైతే బురద మరకలు ఉన్నాయో అక్కడ  వెనిగర్ ను అప్లై చేసి శుభ్రం చేయండి.  అలాగే వేడినీటిలో వెనిగర్ వేసి దాండట్లో నానబెట్టి 20 నిమిషాలు అలాగే ఉంచండి. దీన్ని చేతులతో రుద్దితే ఈజీగా బురద మరకలు పోతాయి. 
 

నిమ్మకాయ, బేకింగ్ సోడా

బేకింగ్ సోడా, నిమ్మరసంతో కూడా  బురద మరకలను పోగొట్టొచ్చు. ఇది దుస్తుల అంచులకు అంటిన బురద మరకలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో బేకింగ్ సోడా, నిమ్మరసాన్ని కలిపి పేస్ట్ తయారు చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ ను మరకలు ఉన్న అంచులకు అప్లై చేసి  బాగా రుద్ది శుభ్రం చేయండి. 

Latest Videos

click me!