కళ్లచుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ కి ఇంట్లోనే సింపుల్ సొల్యూషన్..

First Published | Jun 2, 2024, 4:20 PM IST

కళ్ల కింద నల్లటి మచ్చలు ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఇవి అంత సులువుగా మాత్రం తగ్గవు. అయితే ఇవి ఇంట్లో ఉండే రెండు పదార్థాలతో సులువుగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

టీవీ, మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా చూడటం వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. అలగే నిద్రసరిగ్గా లేకపోయినా, బాగా ఒత్తిడికి గురైనా కూడా కళ్లచుట్టూ నల్ల వలయాలు ఏర్పడతాయి. అందుకే స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా కళ్ల కింద చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తీసుకోవడం చాలా ముఖ్యం.
 

dark circles

డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకునేందుకు చాలా మంది కెమికల్స్ ఉండే క్రీమ్స్ ను వాడుతుంటారు. కానీ ఇవి స్కిన్ కు అంత మంచివి కావు. నిజానికి ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే కళ్ల చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కీరదోసకాయతో. దీనితో చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos



డార్క్ సర్కిల్స్ ను తగ్గించడానికి కావలసిన పదార్థాలు

కీరదోసకాయ
తేనె

కీరదోసకాయను కళ్ల కింద అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

కీరదోసకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందించడానికి సహాయపడతాయి.
అలాగే ఇది మన చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
కీరదోసకాయాలో ఉండే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ముఖంపై రంధ్రాల పరిమాణం పెరగకుండా చేస్తాయి.
అలాగే ఇది చర్మం నల్లబడటాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 

కళ్ల కింద తేనెను అప్లై వల్ల కలిగే ప్రయోజనాలు

తేనె నల్ల మచ్చలు చాలా వరకు తగ్గుతాయి. 
తేనె వాడకం వల్ల ముఖ రంధ్రాలు శుభ్రపడతాయి. 
ముఖ చర్మాన్ని మృదువుగా ఉంచడంలో తేనె బాగా ఉపయోగపడుతుంది. 
తేనె చర్మాన్ని తేమగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
 


డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి? 

డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే ముందుగా 1 కీరదోసకాయను తీసుకుని దాన్ని గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి.  దీనిలో 1 టీస్పూన్ తేనెను కలపండి. ఈ రెండు పదార్థాలను బాగా కలిపి పేస్ట్ లా చేసుకోండి. ఈ పేస్ట్ ను వేళ్లతో లేదా బ్రష్ తో కళ్ల కింద అప్లై చేయండి. 20 నిమిషాల పాటు దాన్ని వదిలేయండి. ఆ తర్వాత  కాటన్ సహాయంతో జాగ్రత్తగా శుభ్రం చేయండి. ఇలా మీరు వారానికి 3 సార్లు ప్రయత్నించొచ్చు. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గుతాయి.

click me!