ఒళ్లు నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Jun 11, 2024, 12:25 PM IST

పని ఎక్కువైతే శరీరం బాగా అలసిపోతుంది. అలాగే బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. ఇలా జరగడం సర్వ సాధారణం. అయితే కొంతమందికి ఎలాంటి కారణం లేకుండా  ఒళ్లు నొప్పులు వస్తాయి. మరి ఈ నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా? 
 

నేటి పేలవమైన జీవనశైలి, చెడు ఆహారాల వల్ల కీళ్ల నొప్పులు, శరీర నొప్పులతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా జ్వరం లేదా అలసట, లేదా పని ఎక్కువ అవడం వల్ల ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది హాస్పటల్ కు వెళుతుంటారు. ఇంకొంతమంది ఈ చిన్న సమస్యకు హాస్పటల్ కు ఎందుకు రెండు మూడు రోజులైతే తగ్గిపోతుందిలే అని అలాగే ఉంటారు. కానీ మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే ఒంటి నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఒంటి నొప్పికి కారణం

చాలా మంది ఆఫీసులో కుర్చీలో కూర్చొని పనిచేస్తారు.దీనివల్ల శరీరంలో ఎక్కువ కదలిక ఉండదు. దీనివల్లే చాలా మందికి ఒళ్లు నొప్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇదొక్కటే కారణం కాకుండా కొన్ని జన్యుపరమైన సమస్యల వల్ల కూడా ఒంటి నొప్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 

Latest Videos


వ్యాయామం

వ్యాయామం మన శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే మీరు బాడీ పెయిన్స్ ను తగ్గించుకోవడానికి ప్రతిరోజూ కొంత సేపు వ్యాయామం చేయండి. వ్యాయామం ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
 

water

హైడ్రేటెడ్ గా ఉండండి

కొన్నిసార్లు నిర్జలీకరణం కూడా ఒంటి నొప్పికి కారణమవుతుంది. అందుకే నీళ్లను ఎక్కువగా తాగాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఒక వయోజనుడు రోజకు 3 నుంచి 4 లీటర్ల నీళ్లను తాగాలి.
 


విశ్రాంతి

ఆడవాళ్లు ఇంటి పని, బయటి పని చేసి బాగా అలసిపోతుంటారు. అందులోనూ వీళ్లకు రెస్ట్ టైం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా బాడీ పెయిన్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి సమయంలో కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే బాడీ పెయిన్స్ తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

sleep

తగినంత నిద్ర 

నిద్రలోనే సగం రోగం తగ్గుతుందని పెద్దలు చెప్పిన మాట వినే ఉంటారు. ఇది నిజమే. నిద్రతో మన శరీరం తిరిగి శక్తివంతంగా మారడం ప్రరంభమవుతుంది. అయితే మీరు కంటినిండా నిద్రపోకపోతే మీ శరీరం తనను తాను రిపేర్ చేసుకోలేదు. దీనివల్ల మీకు లేనిపోని సమస్యలు వస్తాయి. అందులో బాడీ పెయిన్స్ ఒకటి. అందుకే మీరు ఈ సమస్య నుంచి బయటపడాలంటే కంటినిండా నిద్రపోవాలి. 
 

గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి

గోరువెచ్చని నీళ్లు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఒళ్లు నొప్పులు తగ్గాలంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. దీనివల్ల మీ కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే మీరు బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడతాయి. అలాగే టెన్షన్స్ కూడా పోతాయి. 
 

click me!