గోధుమ పిండికి పురుగులు పట్టొద్దంటే ఏం చేయాలి?

First Published | Jun 6, 2024, 1:34 PM IST

చాలా మంది ఒకేసారి గోదుమ పిండిని కొని ఇంట్లో నిల్వ చేస్తుంటారు. కానీ గోధుమ పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పురుగులు పడుతుంటాయి. పిండిని పనికి రాకుండా చేస్తాయి. గోధుమ పిండికి పురుగులు పట్టొద్దంటే ఏం చేయాలో తెలుసా?

గోధుమ పిండి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. గోధుమ పిండి రొట్టెలను చాలా మంది రోజూ తింటుంటారు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది గోధుమ పిండిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనేసి ఇంట్లో నిల్వ చేస్తారు. కానీ పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండేసరికి వాటిలో పురుగులు పడుతుంటాయి. పురుగు పట్టిన పిండిని ఉపయోగించడం కష్టం. అయితే కొన్ని చిట్కాలతో గోధుమ పిండికి ఒక్క పురుగు కూడా పట్టకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 


మసాలా దినుసులు

గోధుమ పిండికి పురుగులు పట్టకుండా చేయడంలో కొన్ని మసాలా దినుసులు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ముఖ్యంగా లవంగాలు, రాతి ఉప్పు, కర్పూరం, వేప ఆకులను గోధుమ పిండిని నిల్వ ఉంచిన పాత్రలో లేదా సంచిలో ఉంచితే ఒక్క పురుగు కూడా దానిలోకి రాదు. వీటి ఘాటైన వాసన వల్ల కీటకాలు గోధుమ పిండిపై దాడి చేయవు.
 



తేమ

గోధుమలు లేదా గోధుమ పిండిని నిల్వ చేసిన కంటైనర్ తేమగా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే తేమ కారణంగా గోధుమలకు, గోధుమ పిండికి పురుగులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మొదలైనవి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. గోధుమలకు పురుగులు పట్టకూడదంటే వీటిని నెలకోసారైనా ఎండలో ఎండబెట్టాలి. ఎండలో ఎక్కువ సేపు ఉంచితే గోధుమలు చెడిపోకుండా ఉంటాయి. పురుగులు కూడా పట్టవు. 
 

పురుగులు పట్టిన పాత గోధుమ పిండిలో కొత్త గోధుమ పిండిని పొరపాటున కూడా కలపకండి. ఇలా చేస్తే కొత్త గోధుమ పిండిపై కూడా పురుగులు దాడి చేస్తాయి. మీరు గోధుమ పిండిని నిల్వ చేసిన కంటైనర్ లోకి గాలి వెళ్లకుండా చూడండి. దీనివల్ల గోధుమ పిండికి పురుగులు పట్టవు. 
 

గోధుమపిండిని కొన్న తర్వాత ప్యాకెట్ నుంచి బయటకు తీయకండి. నేల తేమగా ఉంటే గోధుమ పిండి చెడిపోయే అవకాశం ఉంది. అలాగే పురుగులు కూడా పడతాయి. అందుకే గోధుమ పిండిని నేల నుంచి ఎత్తైన ప్రదేశంలో ఉంచండి.
 

గోధుమ పిండిని నిల్వ చేయడానికి మీరు ఇప్పటికే పాత గోధుమ పిండిని నిల్వ చేసిన పాత్రను ఉపయోగిస్తుంటే..  మీరు దీనిలో ఒక చుక్క నీటిలో కలిపిన మాలాథియాన్ క్రిమిసంహారక మందును ఉపయోగించి పాత్రను కడిగి ఆరబెట్టి వాడండి. 
 

Latest Videos

click me!