breakup: బ్రేకప్ బాధ నుంచి బయటకు రాలేకపోతున్నారా? అయితే ఇలా చేయండి..

First Published | Apr 12, 2022, 10:32 AM IST

breakup: విడిపోవడానికి సవాలక్ష కారణాలున్నా.. ఆ బ్రేకప్ బాధ మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఎంతో హుషారుగా , సంతోషంగా ఉన్న వ్యక్తులు కూడా బ్రేకప్ అయితే  డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు. మరికొందరైతే వారిపై పగ తీర్చుకోవాలని భావిస్తుంటారు. 


ప్రేమలో ఉన్నప్పుడు ప్రతీది ఎంతో అందంగా, మధురంగా అనిపిస్తుంటుంది. వన్స్ ఆ ప్రేమ బ్రేకప్ దాకా ప్రయాణిస్తే మాత్రం ఆ ప్రేమికులకు కలిగే బాధ మాటల్లో చెప్పలేము. బ్రేకప్ కు కారణాలెన్ని ఉన్నా.. ఆ బాధ మాత్రం వారిని మానసికంగా క్రుంగదీస్తుంది. మరికొందరైతే ఈ బాధతో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు. 
 

వాళ్ల లవర్ తో గడిపిన ఆనంద క్షణాలను, పాత సంగతులను గుర్తు చేసుకుంటూ కుంగిపోతారు. ఇక నాకు జీవితమే లేదంటూ బాధపడిపోతుంటారు. జరిగిపోయిన విషయాలను మార్చలేరు. మళ్లీ ముందులా అంత జరగాలంటే జరగదు. కాబట్టి ఈ బ్రేకప్ బాధ నుంచి వీలైనంత తొందరగా బయటకు వచ్చినప్పుడే మీకోసం మీరు బ్రతకగలుగుతారు. సైకాలజిస్టులు సూచిస్తున్న ఈ టిప్స్ బ్రేకప్ బాధకు ప్యాకప్ చెప్తాయి. అవేంటంటే.. 

Latest Videos


మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి.. బ్రేకప్ అయ్యిందని మీకు జీవితమే లేదని మీరు ఎట్టి పరిస్థితిలో భావించకండి. దాని నుంచి బయటపడటానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. ఎందుకంటే జరిగిపోయిన వాటిని మీరు మార్చలేదు. జరిగేదేదో జరిగిపోయింది కాబట్టి దానినుంచి బయటపడేందుకు మాత్రమే మీరు ప్రయత్నించాలి. 
 

కెరీర్ పై ఫోకస్.. బ్రేకప్ బాధనుంచి బయటపడటానికి ఇదే సరైన మార్గం. ఈ బాధనుంచి మీరు తొందరగా బయటపడాలంటే మీ కెరీర్ పై దృష్టి పెట్టండి. ఎందుకంటే జీవితంలో మీరు ముందుకు వెళ్లేందుకు కెరీర్ అనే మెట్టే మీకు ఎంతో సహాయపడుతుంది. 

పాజిటీవ్ ఉండటానికి ప్రయత్నించండి.. బ్రేకప్ అయ్యిందంటే చాలు ఎవరు ఏమనుకుంటారేమోనని ఈ ప్రపంచానికి దూరంగా ఉండటానికే ఇష్టపడతారు. కానీ ఇలాంటి పరిస్థితిలో మీరు అలా ఆలోచించకూడదు. ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా పాజిటీవ్ గా ఉండటానికి ప్రయత్నించాలి.
 

ఒంటరిగా ఉండకండి.. చాలా మంది బ్రేకప్ అయ్యిందని స్నేహితులను, బంధువులను కలవడానికి అస్సలు ఇష్టపడరు. వారికి వీలైనంత దూరంగా ఉంటారు. కానీ ఇలాంటి సమయంలో మీరు అస్సలు ఒంటరిగా ఉండకూడదు. ఎందుకంటే ఒంటిరిగా ఉన్నప్పుడే మీరు పాత సంగతులను గుర్తు చేసుుకుని మరింత బాధపడతారు. డిప్రెషన్ లోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంది. 
 

ఇష్టమైన పనులు చేయండి.. ప్రేమలో ఉన్నప్పటి సంగతి పక్కన పెడితే ఇద్దరూ విడిపోయిన తర్వాత ప్రతిదీ మర్చిపోతుంటారు. ముఖ్యంగా వారి ఆలోచనల్లోనే మునిగిపోతుంటారు. ఇలాంటి పరిస్థితిలో మీరు చేయాల్సింది అన్నింటినీ మర్చిపోవడం కాదు. మీకు ఇష్టమైన పనులను చేయాలి. అప్పుడే మీరు ఆ బాధ నుంచి తొందరగా బయటపడగలుగుతారు. 

ఎలిమినేట్..గతాన్ని మీరు మార్చలేనప్పుడు వాటిని మర్చిపోవడమే మీ ముందు ఉన్న ఒకే ఒక్క మార్గం. పాత ఆలోచనలన్నింటినీ మీ మైండ్ నుంచి తీసేయండి. కొత్త ఆలోచనలకు స్వాగతం పలకండి. అప్పుడే మీ మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకోవడానికి టైం కేటాయించండి. ప్రేమ పోతే మళ్లీ ఏదో ఒకరూపంలో తిరిగి పొందవచ్చు.. కానీ జీవితాన్ని మాత్రం పొందలేము..  

click me!