మీకు బ్రేకప్‌ అయ్యిందా? ఈ టిప్స్‌ పాటించి కొత్త జీవితాన్ని ప్రారంభించండి

First Published | Sep 7, 2024, 4:20 PM IST

ఈ కాలంలో లివ్‌-ఇన్‌ రిలేషన్‌షిప్‌లు, బ్రేకప్‌లు చాలా కామన్‌ అయిపోయాయి. ఎంత త్వరగా ప్రేమించుకుంటున్నారో అంతే త్వరగా విడిపోవాలనుకుంటున్నారు. దీనికి ఎవరికి వారికి వంద కారణాలు ఉంటున్నాయి. ఏది జరిగినా జీవితంలో ముందుకు సాగడం మాత్రం తప్పదు కదా.. ఆ సమయంలో మరో వ్యక్తితో రిలేషన్‌ ఏర్పాటు చేయక తప్పదు.  మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఈ సమయంలో కొత్త బంధం నిలుపుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు, సూచనలు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.
 

ప్రేమ.. ఎంతో మధురమైన అనుభూతి. ఒకరిపై కలిగిన ఆకర్షణ క్రమంగా ప్రేమగా మారి వారితోనే జీవితం పంచుకోవాలనిపిస్తుంది. ఈ క్రమంలోనే కలిసి జీవించడానికి ఒకరికొకరు అంగీకరిస్తారు. పూర్వ అయితే ఈ బంధాన్ని పెళ్లిగా మార్చుకునే వారు. ఈ స్పీడ్‌ కాలంలో ఆ బంధాన్ని లివ్‌-ఇన్‌ రిలేషన్‌షిప్‌ అంటూ ముందు కొంతకాలం కలిసి బతుకుతున్నారు. ఆ సమయంలో ఇద్దరి అభిప్రాయాలు కలిస్తే తర్వాత పెళ్లి చేసుకొనేందుకు సిద్ధపడుతున్నారు. ఇదే టైమ్‌లో చాలా మంది లివ్‌-ఇన్‌ రిలేషన్‌లోనే మనసులు కలవక విడిపోతున్నారు. ఏదో జరిగిందని జీవితంలో ఆగిపోలేరు కదా.. మంచి వ్యక్తి, మనసు, అభిప్రాయాలు కలిసిన మరో వ్యక్తి ఎదురైతే బంధం కలుపుకోవాలి. 
 

లివ్ ఇన్ రిలేషన్షిప్ బ్రేకప్ అయిన తర్వాత కొత్త జీవిత భాగస్వామిని ఎంచుకోవడం, కొత్త బంధంలోకి అడుగుపెట్టడం ఒక రకంగా సవాలే. ఇటువంటి పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు కొంత సమయం తీసుకుని కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. 
 


* ఆత్మపరిశీలన(Self-Reflection) చేసుకోవాలి
ముందుగా మీ గత అనుభవాలను, పొరపాట్లను గుర్తించండి. బ్రేకప్ ఎందుకు జరిగిందో విశ్లేషించుకోండి. మీ జీవితంలో నిజంగా ఏం కావాలో అర్థం చేసుకోండి. ఈ సారి మీరు ఒక సంబంధంలో ఏం కోరుకుంటున్నారో స్పష్టత తెచ్చుకోండి. అలాంటి తప్పులు ఇప్పుడు మీరు ఎంచుకున్న కొత్త వ్యక్తితో జరగడానికి ఛాన్స్‌ ఉందో లేదో ముందే ఆలోచించుకోండి. ఒకవేళ సేమ్‌ మిస్టేక్‌, ఫైటింగ్‌ సిచ్యుయేషన్‌ ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్‌ అవ్వాలో ముందే ప్రిపేర్డ్‌గా ఉండండి. 
 

break up

* ఆత్మగౌరవం, సెల్ఫ్‌ హ్యాపీనెస్‌ ముఖ్యం..
కొత్త సంబంధంలోకి వెళ్లే ముందు మీ ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఉండాలంటే ఎలా బిహేవ్‌ చేయాలో ఆలోచించండి. ముఖ్యంగా మీలోనే సంతోషాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని సంతోష పెట్టేలా మీ కొత్త పార్టనర్‌ ఉండాలని కోరుకోకండి. ఎందుకంటే ఇతరులపైన ఆధార పడినప్పుడే మనం సంతోషాన్ని కోల్పోతాం. మీ అంచనాలకు వారు అందుకోలేకపోవచ్చు. దాని వల్ల మీరు అన్ని విధాలుగా నిరాశకు గురవుతారు. కొత్త సంబంధంలోకి వెళ్లే ముందు మీకు తగినంత సమయం తీసుకోండి.

* సమావేశాలతో బంధాలు బలం..
కొత్త వ్యక్తిని ఎంచుకునే ముందు కొంత సమయం తీసుకోండి. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, విలువలు, ఆలోచనలు, లక్ష్యాలు వంటి వాటిని అంచనా వేయండి. ఇద్దరి అభిప్రాయాలు కలిశాయో లేదో చెక్‌ చేసుకోండి. సుదీర్ఘ బంధానికి ఒకరి మీద నమ్మకం చాలా ముఖ్యం. ఇది ఒకరిపై ఒకరికి కలగాలంటే ఎక్కువ డిస్కషన్‌ జరగాలి. తరచూ కలుసుకొని మాట్లాడుకోవడం వల్ల అభిప్రాయాలు షేర్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 
 

* పాత విషయాలు వదిలేయాలి
కొత్త జీవిత భాగస్వామిని అంగీకరించడానికి ముందు మీ గత అనుభవాలను పూర్తిగా వదిలేయండి. పాత సంబంధంలో ఉన్న గాయాలు ఇంకా తగ్గకపోతే కొత్త వ్యక్తిపై అవి ప్రభావితం చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏమి కావాలో మీ పార్టనర్‌ అర్థం చేసుకునే అవకాశం ఇవ్వండి. వారు కూడా మీ అవసరాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారో లేదో గుర్తించండి. ముఖ్యంగా మీపై మీ భాగస్వామికి నమ్మకం కలిగేలా ప్రవర్తించండి. ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయొద్దు. నిజాయతీగా ఉండండి. 
 

* క్లారిటీ, కాన్ఫిడెన్స్‌ అవసరం..
ఏ బంధంలోనైనా స్పష్టమైన కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఒకరికొకరు ఏం కోరుకుంటున్నారో, ఏది అనవసరమో స్పష్టంగా చెప్పుకోండి. నమ్మకం ప్రతి బంధానికి ప్రధానమైన విషయం. కొత్త బంధం కాబట్టి ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండేలా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. విభేదాలను సృజనాత్మకంగా పరిష్కరించడం ముఖ్యం.

* కౌన్సెలింగ్‌ తీసుకోండి.. 
మీరు పాత బంధంలోని విషయాలు పూర్తిగా వదిలిపెట్టలేకపోతే ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. ఈ కౌన్సెలింగ్ మీకు ఎమోషనల్ క్లారిటీ ఇస్తుంది. కొత్త బంధంలో మీరు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి సహాయం చేస్తుంది. 

* ధైర్యం, సహనం కలిగి ఉండండి..
కొత్త బంధంలో ప్రవేశించడం కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు. కానీ మీరు చిత్తశుద్ధితో, సహనంతో ముందుకు వెళితే మంచి అనుబంధం ఏర్పడే అవకాశం ఉంటుంది.

Latest Videos

click me!