మందులు వాడకుండా జలుబు తగ్గించేదెలా?

First Published | Oct 22, 2024, 12:40 PM IST


మందులతో పనిలేకుండా..జలుబు తగ్గించుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…

ఈ సీజన్ లో ప్రతి ఒక్కరూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారే. ముఖ్యంగా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఇన్ఫెక్షన్ ల బారినపడుతున్నారు. జలుబు కంటే పెద్ద రోగం మరోటి లేదని చెప్పొచ్చు. జలుబు చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక.. దీని నుంచి ఉపశమనం రావాలి అంటే, ఈ రోజుల్లో అందరూ మందులు మింగాల్సిందే. కానీ మందులు వేసుకున్నా రిజల్ట్ కాసేపే ఉంటుంది. అయితే..మందులతో పనిలేకుండా..జలుబు తగ్గించుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…

1. కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ లేదా పుదీనా ఆకులు వేసి ఆవిరి పట్టాలి. ఇలా రోజుకు రెండు, మూడుసార్లు చేయడం వల్ల జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. 

2.జలుబు చేసేటప్పుడు.. శరీరానికి వీలైనంత వరకు రెస్ట్ ఇవ్వాలి.లేదని.. ఎక్కువ వ్యాయామాలు చేయడం, శరీరానికి చెమటలు పట్టేలా చేయడం వల్ల.. జలుబు లక్షణాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.


3. జలుబు చేసినప్పుడు గొంతులో కూడా నొప్పిగా ఉంటుంది. అలాంటి సమయంలో రిలీఫ్ రావడానికి గోరు వెచ్చని నీటితో పుక్కలిస్తూ ఉండాలి. గోరు వెచ్చని నీటిలో ఉప్పు లేదంటే పసుపు వేసి పుక్కిలించడం వల్ల ఎక్కువగా ఉపశమనం లభిస్తుంది. 

4.  తేనె తో కూడా  జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.  తురిమిన అల్లం, మిరియాలు, పసుపు, దాల్చినచెక్కతో తేనెను తీసుకోవడం వల్ల జలుబు లక్షణాలను తగ్గించడానికి ,మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. తేనెను పచ్చిగా తీసుకోవడం, వేడినీరు, టీ లేదా కాఫీతో కలపడం మానుకోవడం ముఖ్యం. తేనె గొంతును ఉపశమనం చేస్తుంది, దగ్గును తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి మీ శరీరానికి సహజమైన శక్తిని అందిస్తుంది.

sneezing

5. వెచ్చని నీటితో హైడ్రేట్ చేయండి, జలుబు సమయంలో పుష్కలంగా నీరు త్రాగడం అవసరం. గోరువెచ్చని నీరు, ముఖ్యంగా, మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది, శ్లేష్మం ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. వైద్యం ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. రోజంతా గోరువెచ్చని నీటిని సిప్ చేయడం వల్ల మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా మీ శరీరం జీవక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.

Latest Videos

click me!