పిల్లలు పండ్లు, కూరగాయలు తినడం లేదా? అయితే ఈ ట్రిక్స్ ట్రై చేయండి..

First Published Nov 8, 2021, 2:32 PM IST

పెద్దలు తిన్నట్టుగా ఏది వండితే అది పిల్లలు తినరు. అందుకే వారికోసం రకరకాల ఆహారాలు ట్రై చేస్తుంటారు తల్లులు. అయితే పిల్లలకు ఎలాంటి ఆహారం ఇచ్చిన అందులో సగానికిపైగా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలని అధ్యయనం చెబుతోంది. 

children diet

చిన్నారులకు పోషకాహారం తినిపించడం ఎప్పుడూ పెద్ద టాస్కే. ఆరోగ్యకరమైన ఆహారాన్ని వారితో తినిపించాలంటే తలకిందులు కావాల్సి వస్తుంది. అయితే చిన్నారుల్లో ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలంటే.. వారి ప్లేట్ లో ఎక్కువగా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలని ఓ అధ్యయనంలో తేలింది. 

kids

బార్బరా రోల్స్, హెలెన్ ఎ. గుత్రీ చైర్, పెన్ స్టేట్‌లోని హ్యూమన్ ఇన్‌జెస్టివ్ బిహేవియర్ స్టడీ ఆఫ్ లాబొరేటరీ డైరెక్టర్ లు చేసిన సంయుక్త అధ్యయనంలో ఇది తేలింది. వీరి అధ్యయనంలో పిల్లల ప్లేట్ లో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూడడం వల్ల కూరగాయల వినియోగం 41 శాతం, పండ్ల వినియోగం 38 శాతం పెరిగిందని తేలింది.

kids

ఆహారాలతో ప్రయోగాలు
పెద్దలు తిన్నట్టుగా ఏది వండితే అది పిల్లలు తినరు. అందుకే వారికోసం రకరకాల ఆహారాలు ట్రై చేస్తుంటారు తల్లులు. అయితే పిల్లలకు ఎలాంటి ఆహారం ఇచ్చిన అందులో సగానికిపైగా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలని అధ్యయనం చెబుతోంది. 

"మీరు పిల్లలకు ఎక్కువగా ఆహారాన్ని ఇస్తున్నట్టు అనిపించి, ఎక్కువ ఆహారం వృథా అవుతుందనిపిస్తే.. మీరు ఎక్కువ ఉత్పత్తులను జోడించేటప్పుడు అధిక క్యాలరీలున్న ఆహారాన్ని తగ్గించవచ్చు. పండ్లు, కూరగాయలతో రకరకాల ఆహారపదార్థాలు చేసి వారితో తినిపించడం వల్ల వారికి కొత్త టేస్ట్ లాగా ఉండి.. తినడానికి ఇష్టపడతారు. మీకూ పిల్లలకు పోషకాలు అందాయని తృప్తి లభిస్తుంది. 

kids

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇంతకుముందు చేసిన అధ్యయనం ప్రకారం, 60 శాతం మంది పిల్లలు తగినంత పండ్లను తీసుకోరు. 93 శాతం మంది తగినంత కూరగాయలు తినరు, పిల్లలు ఎక్కువగా వీటిని తీసుకోవాలంటే కొత్త కొత్త వ్యూహాలు అవసరమని వీరు సూచిస్తున్నారు.

water

2011 నుండి, MyPlate ఆహార మార్గదర్శకాలు ప్రకారం తినే ప్లేట్ లో సగం పండ్లు, కూరగాయలతో నింపడం వల్ల ఆహారంలో పోషకాల స్థాయి పెరుగుతుంది. ఇది ఒక దశాబ్దం పాటు పాలసీగా ఉన్నప్పటికీ, ప్రీస్కూల్ పిల్లలలో ఈ వ్యూహం ఎప్పుడూ క్రమపద్ధతిలో పరీక్షించబడలేదని పరిశోధకులు తెలిపారు.

kids

అధ్యయనం కోసం, పరిశోధకులు పెన్సిల్వేనియా పిల్లల సంరక్షణ కేంద్రాలలో మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయస్సు గల 53 మంది పిల్లల మీద ఇది ప్రయోగించారు. ప్రతి పాల్గొనేవారికి యాదృచ్ఛిక క్రమంలో మూడు వేర్వేరు కాలాల్లో ఐదు రోజుల పాటు వారికి భోజనం, స్నాక్స్ అందించబడ్డాయి.

"పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు పండ్లు, కూరగాయలను మొదటి కోర్సుగా లేదా స్నాక్స్‌గా అందించడం వలన వారు తీసుకోవడం పెరుగుతుంది. అలాగే వాటిని మిశ్రమ వంటలలో చేర్చవచ్చు" అని రోల్స్ చెప్పారు. “ఉదాహరణకు, మీరు మాక్, చీజ్ కోసం సాస్‌లో కొన్ని కాలీఫ్లవర్ లేదా స్క్వాష్‌లను కలపవచ్చు లేదా బ్రౌనీ లేదా కేక్ మిక్స్‌లో ఫ్రూట్ పురీని కలపొచ్చు. దీనివల్ల డిష్ రుచి తగ్గదు. అదే సమయంలో పిల్లలు ఎక్కువ ఉత్పత్తులను తింటారు. మీరు మొత్తం కూరగాయలను వారు స్వంతంగా తినడానికి ప్రోత్సహించాలి. అలాగే వాటిని ఇతర ఆహారాలలో చేర్చి కూడా ఇవ్వొచ్చు.

ఈ అలవాట్లు.. మీ దంతాలను నాశనం చేస్తాయి..!
 

click me!