Recipes: కరకరలాడే క్యాబేజీ 65.. ఫంక్షన్స్ లో చేసే స్టైల్ ఇక ఇంట్లోనే?

Published : Jul 26, 2023, 01:56 PM IST

 Recipes: క్యాబేజీలో కూడా మామూలు కూరల్లాగే మంచి పోషక విలువలు ఉంటాయి కానీ దానికి ఉన్న రుచి వాసన కారణంగా చాలామంది ఈ కూరని ఇష్టపడరు కానీ ఇష్టపడని వారు కూడా ఇష్టపడే విధంగా క్యాబేజీ 65 చేద్దాం.  

PREV
15
Recipes: కరకరలాడే క్యాబేజీ 65.. ఫంక్షన్స్ లో చేసే స్టైల్ ఇక ఇంట్లోనే?

 ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు.. పొడుగ్గా తరిగిన క్యాబేజీ పావు కిలో, కార్న్ ఫ్లోర్ మూడు టీ స్పూన్స్, మైదాపిండి మూడు టీ స్పూన్స్, శెనగపిండి రెండు టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం ఒక టీ స్పూన్, గరం మసాలా అర టీ స్పూన్,
 

25

 ఫుడ్ కలర్ చిటికెడు, కరివేపాకు ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి మూడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా.. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో క్యాబేజీ తురుముని తీసుకోవాలి.
 

35

తర్వాత ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి నూనె పక్కనపెట్టి మిగిలినవన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి నూనె వేడెక్కాక తగినంత క్యాబేజీ మిశ్రమాన్ని తీసుకుంటూ పకోడీ లాగా వెయ్యాలి.
 

45

వీటిని మరి స్లోగా కాకుండా మరి హై లో కాకుండా మధ్యస్థంగా మంట పెట్టుకొని ఎర్రగా కరకరలాడే లాగా వేపుకోవాలి. తర్వాత అదే నూనెలో పచ్చిమిర్చి కరివేపాకు వేయించి.. ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎంతో రుచిగా ఉండే ఫంక్షన్స్ లో ఉండేలా క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ రెడీ అవుతుంది. దీనిని భోజనంలోకి సైడ్ డిష్ గాను తీసుకోవచ్చు.. సాయంత్రం పూట స్నాక్స్ గాను తీసుకోవచ్చు.
 

55

 క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ నెఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అలాగే ఇందులో మెగ్నీషియం కాల్షియం, ఐరన్ జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా కూడా క్యాబేజీ 65 చాలా మంచిది.

click me!

Recommended Stories