ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ బరువును తగ్గించుకోవడానికి ఎంతో తిప్పలు కూడా పడుతున్నారు. అయినా బరువు తగ్గని వారు చాలా మంది ఉన్నారు. అయితే మీరు కొన్ని అలవాట్లు చేసుకుంటే సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.
జీలకర్ర నీరు
మీరు ఫాస్ట్ గా బరువు తగ్గాలంటే మాత్రం ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు జీలకర్ర వాటర్ ను తాగడం అలవాటు చేసుకోండి. ఈ వాటర్ మీ జీవక్రియను పెంచుతుంది. జీలకర్ర మీ జీర్ణక్రియను పెంచుతుంది. అలాగే మీరు వెయిట్ లాస్ అయ్యేందుకు సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన స్నాక్స్
చిప్స్ లాంబి బయటిఫుడ్ ను స్నాక్స్ గా అస్సలు తినకండి. ఎందుకంటే ఇవి మీ బరువును పెంచడంతో పాటుగా మీ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకే ఆకలిగా అనిపించినప్పుడు డ్రై ఫ్రూట్స్, పండ్లు, గింజలు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తినండి. ఇవి మీ ఆకలిని తగ్గిస్తాయి. అలాగే మీ శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. అలాగే రోజంతా ఇవి మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతాయి.
50 నిమిషాల వ్యాయామం
బరువు తగ్గాలంటే మాత్రం ప్రతిరోజూ వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. బరువు తగ్గడానికి మీరు ప్రతిరోజూ 50 నిమిషాల పాటు ఎక్సర్ సైజ్ చేయండి. ఇది కేలరీలను బర్న్ చేయడానికి, అదనపు బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.
గ్రీన్ టీ
పాలు, పంచదార కలిపిన టీ కంటే గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇది మీ జీవక్రియను పెంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఇందుకోసం రోజుకు రెండుసార్లు గ్రీన్ టీని తాగండి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, కాటెచిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీరు హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
sugar
షుగర్ తగ్గించండి
తొందరగా బరువు తగ్గాలంటే మాత్రం మీరు తీసుకునే చక్కెరను తగ్గించండి. అవును చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువును వేగంగా పెంచుతాయి. అందుకే చక్కెర పానీయాలు, స్నాక్స్, స్వీట్లను తినకండి. వీటికి బదులుగా హెల్తీ ఫుడ్స్ ను తినండి.
sleep
నాణ్యమైన నిద్ర
బరువు తగ్గడానికి మంచి నిద్రకూడా అవసరమే. మీరు సరిగ్గా నిద్రపోకుంటే నిద్ర హార్మోన్ల లెవెల్స్ కు ఆటంకం కలుగుతుంది. అలాగే మీ ఆకలిని పెంచుతుంది. దీంతో మీరు బరువు తగ్గడం కష్టమవుతుంది. కాబట్టి బరువు తగ్గాలంటే మీరు కంటినిండా నిద్రపోవాలి.
నీళ్లు తాగాలి
నీళ్లు మీ బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అందుకే రోజు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లను తాగండి. నీళ్లు మీ బాడీని హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా విషాన్ని కూడా బయటకు పంపడానికి సహాయపడుతుంది. నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలుగుతుంది. అలాగే అతిగా తినకుండా ఉంటారు.
రాత్రి భోజనం తర్వాత నడక
రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా 20 నిమిషాల పాటు నడవండి. ఇలా నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. అలాగే రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే మీరు ఫాస్ట్ గా బరువు కూడా తగ్గుతారు.