గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోకూడదంటే ఏం చేయాలి?

First Published | Jun 26, 2024, 10:00 AM IST

ఈ రోజుల్లో దాదాపు ప్రతిఒక్క ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ప్రతి మధ్యతరగతి ఫ్యామిలీ వీలైనన్ని ఎక్కువ రోజులు గ్యాస్ సిలిండర్ రావాలని కోరుకుంటారు. కానీ ఇది సాధ్యం కాదు. కానీ మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం మీ గ్యాస్ సిలిండర్ నెల రోజుల కంటే ఎక్కువ రోజులు వస్తుంది. 
 

పట్నం అయినా, పల్లె అయినా నేడు దాదాపుగా అన్నిచోట్లా వంట చేయడానికి గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పై వంట చేయడం చాలా ఈజీ. అలాగే తొందరగా కూడా వంట అవుతుంది. దీంతో టైం చాలా ఆదా అవుతుంది. కానీ ఈ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్యుడికి ఇది గుదిబండగా మారింది. ఇలాంటి పరిస్థితిలో.. ప్రతి ఒక్కరూ సిలిండర్ వీలైనన్ని ఎక్కువ రోజులు రావాలని కోరుకుంటారు. కానీ సిలిండర్ నెలకంటే ముందే అయిపోతుంటుంది. కానీ ధరలు పెరగడం వల్ల ఇది సామాన్యుడికి పెద్ద తలనొప్పిగా మారుతోంది. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే నెలకంటే ఎక్కువ రోజులే మీ గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఇందుకోసం ఏం చేయాలంటే?

cooking

గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే వంట చేసేటప్పుడు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

1) చాలా మంది అప్పుడే తోమిన పాత్రలను స్టవ్ పై పెట్టి వంట చేస్తుంటారు. కానీ తడి పాత్రలను వేడి చేయడానికి  చాలా సమయం పడుతుంది. దీనివల్ల గ్యాస్ వృధా అవుతుంది. మీ గ్యాస్  ఎక్కువ రోజులు రావాలంటే మాత్రం మీరు తడి పాత్రలను ఎప్పుడూ కూడా గ్యాస్ పై పెట్టకూడదు. అలాగే పాత్రను పొడి గుడ్డతో తుడిచిన తర్వాతే స్టవ్ పై పెట్టండి. 
 

Latest Videos


2) వంట చేయడానికి మీరు ఎక్కువగా ప్రెజర్ కుక్కర్లను ఉపయోగించండి. ఎందుకంటే కుక్కర్ లో ఆహారం చాలా త్వరగా అవుతుంది. దీనివల్ల గ్యాస్ చాలా వరకు ఆదా అవుతుంది. అలాగే వంట చేసేటప్పుడు గిన్నెలపై మర్చిపోకుండా మూతలను పెట్టాలి. దీనివల్ల ఆహారం త్వరగా ఉడుకుతుంది. దీంతో గ్యాస్ ఆదా అవుతుంది. 

3) గ్యాస్ ఆదా అవ్వాలంటే మాత్రం గ్యాస్ బర్నర్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. కానీ చాలా మందికి వీటిని శుభ్రం చేసే అలవాటు అస్సలు ఉండదు. దీనివల్ల గ్యాస్ బర్నర్ లో చాలా మురికి పేరుకుపోతుంది. దీనివల్ల గ్యాస్ సరిగా మండకుండా వృథా అవుతుంది. మంట రంగును బట్టి బర్నర్ ను శుభ్రం చేయాలా? వద్దా? అని డిసైడ్ చేసుకోండి. ఒకవేళ మంట రంగు మారితే దానిని శుభ్రం చేయండి. 
 

4) చాలా సార్లు మనం పాలను ఫ్రిజ్ లోనుంచి బయటకు తీసి డైరెక్ట్ గా గ్యాస్ మీద పెడతాం. కానీ ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. ఎందుకంటే ఇవి వేడెక్కడానికి చాలా టైం పడుతుంది. ఫ్రిజ్ లో ఉన్నవి వేడి చేయాలంటే మాత్రం వీటిని కాసేపు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఆ తర్వాత గ్యాస్ పై పెడితే గ్యాస్ చాలా వరకు ఆదా అవుతుంది. 
 

5) ఎలాంటి ఆహారమైనా సరే దాన్ని మీడియం మంటపైనే ఉడికించండి. ఎక్కువ మంట మీద వంట చేస్తే గ్యాస్ చాలా ఖర్చవుతుంది. అలాగే పైపు నుంచి లీకేజీ అవుతుందో? లేదో తెలుసుకోవడానికి గ్యాస్ సిలిండర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.

click me!