ఈ ఒక్కదాంతో.. మీ ఇంట్లో ఒక్క బల్లి కూడా లేకుండా పోతుంది

First Published | Oct 7, 2024, 3:27 PM IST

దాదాపు ప్రతి ఇంట్లో బల్లులు ఉంటాయి. కానీ ఇవి ఇంటిని చాలా మురికిగా కనిపించేలా చేస్తాయి. చాలా మందికి బల్లులంటే భయం కూడా ఉంటుంది. అందుకే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఒక్క బల్లి కూడా లేకుండా చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చాలా మంది ఇండ్లల్లో బల్లుల బెడద ఎక్కువగా ఉంటుంది. కిచెన్, హాల్, బెడ్ రూం, బాత్ రూం ఇలా ప్రతి ఒక్క రూంలో ఇవి కనిపిస్తుంటాయి. చాలా మంది బల్లులకు భయపడిపోతుంటారు. అందులోనూ ఇవి ప్రతి ఇంటిని మురికిగా మార్చేస్తాయి. అందులోనూ మతపరమైన కోణంలో బల్లులను చెడుగా భావిస్తారు. కాబట్టి ఇంట్లో బల్లులు ఉండకుండా చూసుకుంటారు. కానీ ఈ బల్లులు అంత సులువుగా ఇంట్లో నుంచి పోవు. 

చాలా మంది బల్లులను తరిమికొట్టేందుకు మార్కెట్ నుంచి ఇన్ సెక్ట్ కిల్లర్ స్ప్రేను కొంటుంటారు. అలాగే చీపుర్లు, కట్టెలతో కూడా బల్లులను తరిమికొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా చేసినా ఇంట్లో నుంచి ఒక్క బల్లికూడా పోదు. పైగా అవి ఇంట్లో చాలా చోట్ల దాక్కుంటుంటాయి. కానీ రూపాయి ఖర్చు లేకుండా మీరు కొన్ని సింపుల్ టిప్స్ తో ఇంట్లో ఒక్క బల్లి కూడా లేకుండా చేయొచ్చు. అదెలాగంటే? 

బల్లులు ఇంట్లో నుంచి పోవాలంటే ఏం చేయాలి? 

బల్లులను తరిమికొట్టడానికి ఇంట్లో ఈ వస్తువులతో స్ప్రే తయారు చేయండి. ఇందుకోసం వెల్లుల్లి, ఉల్లిపాయ, నల్ల మిరియాల పొడి, ఎండుమిర్చి పొడి, వాటర్ ను తీసుకోండి. ముందుగా వెల్లుల్లి, ఉల్లిపాయ తొక్క తీసి చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఒ గిన్నెను తీసుకుని అందులో ఒక లీటర్ నీళ్లు పోసి మీడియం మంట మీద వేడి చేయండి. ఈ నీళ్లలో ఈ నీటిలో తరిగిన వెల్లుల్లి-ఉల్లిపాయను వేసి 5 నిమిషాల పాటు మరిగించండి. ఆ తర్వాత ఈ వాటర్ లో సగం చిన్న చెంచా మిరియాల పొడి, ఎండుమిర్చి పొడిని వేసి 5 నిమిషాల పాటు మరగనివ్వండి.  ఈ వాటర్ కలర్ కొద్దిగా మారినప్పుడు మంటను ఆఫ్ చేయండి. 

ఈ ద్రవాన్ని కాసేపు చల్లారనివ్వండి. తర్వాత వడకట్టి స్ప్రే బాటిల్ లో నింపండి. ఇప్పుడు ఈ స్ప్రేను బల్లులపై లేదా అవి తిరిగే ప్రదేశాల్లో స్ప్రే చేయండి. ఈ చిట్కా బల్లులను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనికి మీరు ఎలాంటి రసాయనాలను వాడాల్సిన అవసరం ఉండదు. నల్ల మిరియాలు, తెల్ల మిరియాలు బల్లులను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 
 


lizard

అలాగే ఎండుమిర్చి, నల్ల మిరియాలు, ధనియాల పొడి వంటి సుగంధ ద్రవ్యాల వాసన కూడా బల్లులకు అస్సలు నచ్చదు. వీటి వాసన వచ్చే చోట బల్లులు ఒక్క నిమిషం కూడా ఉండవు. ఈ మసాలా దినుసులన్నింటిని నీళ్లలో కలిపి స్ప్రేను తయారుచేయండి. దీన్ని బల్లులపై లేదా బల్లులున్న చోట స్ప్రే చేస్తే సరిపోతుంది. 

పొగాకుతో బల్లులు  లేకుండా చేయండి

పొగాకు ఘాటైన వాసన బల్లులను ఇంటికి దూరంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం నీళ్లలో కొద్దిగా పొగాకును కలిపి ద్రావణాన్ని తయారుచేసి పిచికారీ చేయండి.
 


బల్లులను వెల్లుల్లి, ఉల్లిపాయలతో తరిమికొట్టొచ్చు

వెల్లుల్లి, ఉల్లిపాయల ఘాటైన వాసన మీ ఇంట్లో ఒక్క బల్లి కూడా లేకుండా చేస్తుంది. ఇందుకోసం వీటిని పచ్చిగా తీసుకోవచ్చు లేదా.. వాటి రసాన్ని వాడొచ్చు.  అంటే మూలల్లో వీటి రసాన్నిచల్లొచ్చు. కావాలనుకుంటే మీరు ఈ రసాన్ని నీళ్లలో కలిపి స్ప్రే చేయొచ్చు. బల్లులు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో దీన్ని చల్లితే వెంటనే ఫలితం ఉంటుంది. 

పుదీనా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది

బల్లులకు పుదీనా వాసన అస్సలు నచ్చదు. దీన్ని ఉపయోగించి మీరు మీ ఇంట్లో ఒక్క బల్లి కూడా లేకుండా చేయొచ్చు. ఇందుకోసం పుదీనా ఆకులను మూలల్లో ఉంచండి. కావాలనుకుంటే మీరు పుదీనా నూనెను నీళ్లలో కలిపి స్ప్రే చేయొచ్చు. 


కర్పూరం : కర్పూరం ఘాటైన వాసన కూడా ఇంట్లో ఒక్క బల్లి లేకుండా తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం కర్పూరం ముక్కను మూలల్లో ఉంచండి. లేదా దీన్ని నీటిలో కరిగించి స్ప్రే చేయండి. 

బల్లులు ఇంట్లో లేకుండా చేసే ఇతర మార్గాలు

ఇంటి తలుపులను, కిటీకీలను మూసి ఉంచాలి. బయటి నుంచి వచ్చే కాంతి తగ్గితే ఇంట్లో బల్లులు లేకుండా పోతాయి. అలాగే మీ ఇంటి చుట్టు చెట్లు, పొదులు పెరగకుండా చూసుకోండి. లేదంటే మీ ఇంట్లోకి చాలా బల్లులు వస్తాయి. ఇళ్లు మురికిగా ఉంటే కూడా బల్లులు వస్తాయి. కాబట్టి మీ ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. 

Latest Videos

click me!