వీపు నల్లగా ఉందా? అయితే ఇలా చేయండి

First Published | Feb 16, 2024, 10:53 AM IST

చాలా మందికి బ్యాక్ లెస్ డ్రెస్సులు, బ్లౌజులు వేసుకోవడం ఇష్టముంటుంది. కానీ మెడ, వీపు భాగం నల్లగా ఉండటం వల్ల ఇలాంటి బట్టలను, ఇష్టమైన డ్రెస్సులను వేసుకోలేకపోతుంటారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో నలుపును పోగొట్టొచ్చు. 

బ్యాక్ లెస్ బట్టలను వేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే మనం బ్యాక్ క్లీనింగ్, వ్యాక్సింగ్ పై దృష్టి పెడతాం. కానీ దీని శుభ్రత గురించి చాలా రోజులు పట్టించుకోకపోతే మాత్రం వీపు నల్లగా మారుతుంది. దీనివల్ల వ్యాక్సింగ్ , క్లీనింగ్ తర్వాత కూడా పెద్దగా తేడా ఉండదు. ముఖం, చేతులకు భిన్నంగా మీ వీపు కనిపిస్తుంది.  ఒకవేళ మీరు పెళ్లి లేదా ఫంక్షన్ లో బ్యాక్ లెస్ డ్రెస్ లేదా బ్లౌజ్ ను వేసుకోబోతున్నట్టైతే.. ఈ చిట్కాల సహాయంతో వీపు నలుపును పోగొట్టండి. 
 

కలబంద

వీపు నలుపును పోగొట్టడానికి కలబంద జెల్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల కలబంద గుజ్జును తీసుకుని అందులో అంతే మొత్తంలో నిమ్మరసం వేసి కలపండి. ఈ రెండు పదార్థాలను బాగా మిక్స్ చేసి మిశ్రమంలా తయారుచేయండి. ఈ పేస్ట్ తో వీపు భాగంలో పెట్టి కొద్ది సేపు మసాజ్ చేయండి. దీన్ని స్నానానికి ముందు వాడాలి. 10 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. రోజూ వాడటం వల్ల డార్క్ స్కిన్  తొలగిపోతుంది. 
 


శెనగ పిండి

శెనగపిండిని చాలాకాలంగా చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. శెనగపిండి చర్మాన్ని మృదువుగా మార్చడానికి, రంగును మెరుగుపరచడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వీపు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి శెనగపిండిని కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో శెనగపిండి, పెరుగు, పసుపు, నిమ్మరసం లేదా రోజ్ వాటర్ ను వేసి కలపండి. అన్ని పదార్థాలన్నింటిని కలిపి పేస్ట్ లా తయారుచేయండి. దీన్ని వీపు భాగానికి అప్లై చేసి బాగా ఆరనివ్వండి. స్నానం చేసే ముందు దీన్ని వాడండి. కొన్ని వారాల్లో మీరు తేడాను చూస్తారు.

ఎర్ర పప్పు

మసూర్ పప్పు లేదా ఎర్ర పప్పును చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. దీనితో ముఖం మాత్రమే కాదు వీపు రంగును కూడా మెరుగుపరుచుకోవచ్చు. ముందుగా మసూర్ పప్పును గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల నిమ్మరసం, మసూర్ పప్పును కలపాలి. కలబంద జెల్, పెరుగు కూడా దాని ప్రభావాన్ని మరింత పెంచడానికి ఉపయోగించొచ్చు. తర్వాత వీపు భాగానికి అప్లై చేసి ఆరిన తర్వాత తేలికపాటి స్క్రబ్బింగ్ తో కడిగేయండి.

Latest Videos

click me!