చుండ్రు పూర్తిగా పోవాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Jun 6, 2024, 4:51 PM IST

చుండ్రును చాలా చిన్న సమస్యగా భావిస్తారు చాలా మంది. కానీ ఇది జుట్టు పూర్తిగా రాలేలా చేస్తుంది. అయితే మార్కెట్ లో చుండ్రును పూర్తిగా పోగొడుతాయి అని చెప్పుకునే షాంపూలు చాలానే ఉన్నాయి. కానీ కొన్ని కొన్నిసార్లు ఇవి కూడా పనిచేయవు. కానీ కొన్ని ఇంటి చిట్కాలు మాత్రం చుండ్రును పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే? 
 

చుండ్రు సమస్య ఒక్క చలికాలంలోనే కాదు ప్రతి సీజన్ లో వేధిస్తుంది. కానీ లైట్ తీసుకోవాల్సినంత చిన్న సమస్యైతే ఇది కాదు. ఎందుకంటే చుండ్రు జుట్టును పొడిబారేలా చేయడంతో పాటుగా జుట్టు రాలడానికి కూడా కారణమవుతుంది. నిపుణుల ప్రకారం.. కొన్ని చిట్కాలు చుండ్రును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గాపనిచేస్తాయి. అవేంటంటే?
 

1. ఒక కప్పు పెరుగులో 1 టేబుల్ స్పూన్ మెంతి పొడిని వేయండి. అలాగే దీనిలో 1 టేబుల్ స్పూన్ త్రిఫల చూర్ణాన్ని వేసి రాత్రంతా దీన్ని నానబెట్టండి. దీన్ని ఉదయాన్నే బాగా మిక్స్ చేసి తలకు పట్టించి కనీసం గంట సేపు అలాగే ఉండండి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. 


2. మీ జుట్టుకు ఎంత నూనె పడుతుందో అంచనా వేసి దాన్ని గోరువెచ్చగా వేడి చేయండి. దీనిలో ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని వేసి కలపండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. దీన్ని జుట్టుకు అప్లై చేసి రాత్రంతా అలాగే వదిలేయండి లేదా తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు అప్లై చేయాలి. దీన్ని వారానికి ఒకసారి అప్లై చేస్తే తేడా కనిపిస్తుంది.
 


చుండ్రుకు కారణాలు

చుండ్రు సమస్య వెనుక చాలా కారణాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువ జంక్, పుల్లని పదార్థాలు, పులియబెట్టిన ఆహారాన్ని తినడం, మాంసాహారం, వేడివేడి ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల చుండ్రు వస్తుంది. అలాగే  రాత్రిపూట  ఆలస్యంగా పడుకోవడం, ఒత్తిడికి గురికావడం, ఎక్కువ కెమికల్స్ ఉన్న షాంపూలను వాడటం,  జుట్టును సరిగ్గా కడగకపోవడం, ఎక్కువ నూనె పెట్టడం వల్ల చుండ్రు వస్తుంది. అందుకే ఈ తప్పులు చేయకూడదు. 

Latest Videos

click me!