ఇదొక్కటి చేస్తే..లావుగా ఉన్న బుగ్గలు సన్నగా అవుతాయి

First Published | Sep 12, 2024, 12:05 PM IST

చబ్బీ బుగ్గలు చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. వీళ్ల ముఖంలో బుగ్గలే ముందు కనిపిస్తాయి. కానీ కొన్ని సార్లు ఈ లావు బుగ్గలే అందాన్ని పాడు చేస్తాయి. అందుకే చాలా మంది చబ్బీ బుగ్గలను తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. 
 

నిజానికి చబ్బీ బుగ్గల్లో ప్రతి  ఒక్కరూ అందంగా, మంచి అట్రాక్షన్ గా కనిపిస్తారు. కానీ కొంతమందికి ఈ చబ్బీ బుగ్గలు సెట్ కావు. చబ్బీ బుగ్గల వల్ల అందం తగ్గుతుందని భావిస్తారు. చాలా మంది సన్నగా, అందంగా, స్లిమ్ గా ఉండే ముఖ రూపాన్ని కోరకుంటారు. కానీ ఇది అంత సులువైన పనైతే కాదు. 

చబ్బీ బుగ్గలు స్లిమ్ గా కావాలంటే మాత్రం మీరు ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. అలాగే వ్యాయామం  చేయాలి. మీ లైఫ్ స్టైల్ బాగుండాలి. అసలు చబ్బీ బుగ్గలు సన్నగా కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

సమతులాహారం..

ముఖంపై ఉండే కొవ్వును తగ్గించడానికి సమతుల్య ఆహారం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కాబట్టి మీ రోజువారి ఆహారంలో పండ్లను, కూరగాయలను, తృణధాన్యాలు, సన్నని ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చండి. ఈ ఫుడ్స్ అధిక కేలరీలు తీసుకోకుండా మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. 

పండ్లు, కూరగాయలలో ఫైబర్, కేలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఆకలిని చాలా వరకు తగ్గిస్తాయి. అలాగే మీరు తీసుకునే కేలరీల మొత్తాన్ని కూడా చాలా వరకు తగ్గించడానికి సహాయపడతాయి.

చికెన్, చేపలు, టోఫు, చిక్కుళ్లు వంటి లీన్ ప్రోటీన్లు కూడా మీకు సహాయపడతాయి. ఇవి కండరాలను నిర్మించడానికి,  జీవక్రియను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి.

అలాగే బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్ వంటి తృణధాన్యాలను కూడా తినండి. ఎందుకంటే ఇవి మీ శరీరానికి అవసరమైన స్థిరమైన శక్తిని అందిస్తాయి. అలాగే మీరు అతిగా తినకుండా చేస్తాయి. ఇవి మీ బరువును తగ్గిస్తాయి. 
 


హైడ్రేటెడ్ గా ఉండండి

మీ మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. అలాగే ముఖం లో పేరుకుపోయిన కొవ్వును, ఉబ్బును తగ్గించడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది. మీరు నీళ్లను మెండుగా తాగితే శరీరంలో ఉన్న విషం కూడా బయటకు పోతుంది. అలాగే నీటి నిలుపుదల కూడా తగ్గుతుంది. ఇది చబ్బీ బుగ్గలను స్లిమ్ గా చేయడానికి సహాయపడుతుంది. 

ఉప్పు, చక్కెరను తగ్గించండి

ఉప్పు, చక్కెరను మీరు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇవి మీ శరీంరలో నీరు నిలిచేలా చేస్తాయి. అలాగే మీరు విపరీతంగా బరువు పెరిగేలా చేస్తాయి.

కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, ఉప్పగా ఉండే స్నాక్స్ ను తగ్గించండి. వీటికి బదులుగా తేనె లేదా పండ్లు వంటి సహజ స్వీట్లను తినండి. ఉప్పుకు బదులుగా మూలికలు, సుగంధ ద్రవ్యాలను ఫుడ్ లో ఉపయోగించండి.
 

శారీరకంగా చురుకుగా ఉండండి

మీరు ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల మీ ముఖ కొవ్వు తగ్గడంతో పాటుగా మీ బాడీలో  పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. ఇది మీ మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్, ముఖ వ్యాయామాలను చేయండి. 

అలాగే రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలను చేస్తే కండరాలను పెరుగుతాయి.

మీ జీవక్రియ కూడా పెరుగుతుంది. అలాగే కొవ్వు కరుగుతుంది. బుగ్గలు కిందికి, పైకి అనడం, దవడ వ్యాయామాలను చేస్తే మీ  ముఖం స్లిమ్ గా అవుతుంది. 
 

ఆరోగ్యకరమైన కొవ్వులు

మీ రోజువారి ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను ఖచ్చితంగా చేర్చండి. ఎందుకంటే ఇవి మీరు బరువు తగ్గడానికి, మీరు మొత్తంగా హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది. ఇందుకోసం అవొకాడోలు, కాయలు, విత్తనాలు,  ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోండి. ఇవి మీ ఆకలిని తగ్గించి జీవక్రియను పెంచుతాయి. 
 

Latest Videos

click me!