ప్రస్తుత కాలంలో యువకులు గడ్డాన్ని పెంచుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు.. ప్రతి ఒక్కరూ గడ్డాన్ని పెంచుతున్నారు. ఎందుకంటే ఈ లుక్ క్రేజీగా ఉంటుంది. అలాగే హ్యాండ్ సమ్ గా కూడా కనిపిస్తారు. కానీ గడ్డాన్ని పెంచడం వల్ల ఒక సమస్య మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అదేంటో కాదు దురద. అవును ఒత్తుగా గడ్డం ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది ఫంగల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా వస్తుంది. అందుకే ఒత్తైన గడ్డం ఉన్నవారు పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలి. మరి గడ్డం దురదను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
beard
- ఒత్తైన గడ్డం ఉన్నవారు పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలి. ఇందుకోసం మీ స్కిన్ టైప్ ను బట్టి మంచి క్లెన్సర్ ను వాడండి.
- ప్రతిరోజూ స్నానం చేయడానికి ముందు మీ గడ్డానికి నూనె పెట్టి మసాజ్ చేయండి.
- గోరువెచ్చని నీటితో గడ్డాన్ని కడగడం వల్ల కూడా శుభ్రత గడ్డంలో దురద పెట్టే అవకాశం తగ్గుతుంది. అలాగే గడ్డంలో ఉన్న ఫంగల్, బ్యాక్టీరియాల తొలగిపోతాయి.
- గడ్డం వెంట్రుకలు బాగా పెరగడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీని కోసం మీరు రోజూ హైడ్రేటింగ్ కండీషనర్ ను ఉపయోగించండి.
- షేవింగ్ లేదా ట్రిమ్మింగ్ తర్వాత ఆఫ్టర్ షేవ్ వాష్ లేదా లోషన్ ను ఖచ్చితంగా ఉపయోగించండి.
- మీరు గడ్డాన్ని సబ్బుతో కడుగుతారా? అయితే మీ గడ్డాన్ని నీళ్లతో బాగా కడగండి. ఎందుకంటే కొన్నిసార్లు సబ్బు కూడా దురదకు కారణమవుతుంది.