కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఎలా భద్రపరచాలంటే...

First Published | Aug 24, 2021, 3:57 PM IST

మీరు ఏ కూరగాయలైతే నిల్వ చేద్దామనుకుంటున్నారో.. వాటిని తీసుకుని ముందుగా శుభ్రంగా కడిగి... పొడి బట్టతో తడిపోయేలా తుడవాలి. తరువాత పొట్టు ఉన్నవైతే వాటిని గీరాలి.

మీకు వంట చేయడం ఇష్టమా? రకరకాల శాఖాహారాలు ఎంతో అద్భుతంగా చేస్తారా? కానీ కొన్ని రకాల వంటలు ఎప్పుడంటే అప్పుడు చేయలేకపోతున్నారా? దానికి కావాల్సిన సీజనల్ కూరగాయలు దొరకడం లేదా? దీనికి సరైన పరిష్కారం. సీజన్ లో దొరికే కూరగాయలు సీజన్ కానీ సమయంలో కూడా అంతే తాజాగా వాడగలగడమే. అదెలా? అంటారా? దీనికో చిట్కా ఉంది. ఇంట్లోనే ఈజీగా దీన్ని ఫాలో అయితే అన్ సీజన్ అయినా క్యారెట్ ఘమఘమలు, బఠాణీ రుచులు, బీన్స్ లోని పోషకాలు ఎంచక్కా పొందొచ్చు. 
 
దీనికోసం అన్ని సీజన్లలోనూ దొరికే కూరగాయలు కాకుండా.. కేవలం సీజన్లో మాత్రమే దొరికే కూరగాయల్ని ఎంచుకోండి. వీటిని ఒక పద్ధతి ప్రకారం ప్రీజర్ లో భద్రపరచడం ద్వారా సంవత్సరం పొడవునా తాజా రుచిని పొందొచ్చు. క్యారట్, బీన్స్, బఠాణీ లాంటివి వీటిల్లో ముందు వరుసలో వస్తాయి. అయితే ఇది సరైన పద్ధతిలో చేస్తేనే ఎక్కువ కాలం  ఈ కూరగాయలు తాజాగా ఉంటాయి. అదెలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

మీరు ఏ కూరగాయలైతే నిల్వ చేద్దామనుకుంటున్నారో.. వాటిని తీసుకుని ముందుగా శుభ్రంగా కడిగి... పొడి బట్టతో తడిపోయేలా తుడవాలి. తరువాత పొట్టు ఉన్నవైతే వాటిని గీరాలి.. క్యారట్ లాంటి కూరగాయలైతే పొట్టును గీరి.. చిన్నచిన్న నలుచదరపు ముక్కలుగా కోసుకోవాలి. బఠానీల్లాంటివి అయితే గింజలు ఒలిచి పెట్టుకోవాలి. బీన్స్ లాంటి కూరగాయలైతే చిన్న ముక్కలుగ కట్ చేసుకోవాలి. 

ఇప్పుడు స్టౌ మీద ఓ గిన్నె పెట్టి అందులో మూడొంతులు నీళ్లు పోసి వేడి చేయాలి. దీంట్లో కట్ చేసిన కూరగాయ ముక్కలు.. ఉదా.కు నుకుందాం. వాటిపి వేసి, కాస్త ఉప్పు కలిపి.. మంట పెంచాలి. కాసేపు నీళ్లు మరిగేలా చూసుకోవాలి. నీళ్లతో పాటు క్యారెట్లు మరుగుతుంటూ మంట ఆర్పేసి.. నీటిని మొత్తం తీసేయాలి. 

కూరగాయల ముక్కలు బాయిల్ అవుతున్న సమయంలోనే మరో గిన్నెలో ఐస్ వాటర్ పోసి పెట్టుకోవాలి. వేడినీళ్లను పూర్తిగా ఒంపేశాక ఆ కూరగాయ ముక్కల్ని వెంటనే ఈ చల్లనీటి గిన్నెలో వేయాలి. పై నుంచి ఐస్ ముక్కలు వేసి బ్లాంచ్ చేయాలి. అలా ఈ ఐస్, కోల్డ్ వాటర్ లో కూరగాయల ముక్కల్ని పదినిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల కూరగాయలు పూర్తిగా ఉడికిపోకుండా ఆగిపోతాయి.

పదినిమిషాల తరువాత ఈ చల్లటినీటినుంచి ముక్కల్ని వడకట్టి ఓ పొడిబట్టమీద వెడల్పుగా చేసి ఆరబెట్టాలి. మరో పొడి బట్టతో కూరగాయముక్కల పైనుంచి సున్నితంగా అద్దుతూ తడిని పీల్చేలా చేయాలి. తరువాత పదిహేను నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. అన్ని రకాల కూరగాయలకు ప్రాసెస్ ఇదే. అయితే ఒకేసారి రెండు రకాల కూరగాయల్ని కలపకపోవడమే మంచిది. 

ఇక ఇప్పుడు మన కూరగాయలు స్టోరింగ్ కి రెడీ అయినట్టే... ఈ కూరగాయ ముక్కల్ని జిప్ లాక్ బ్యాగుల్లోకి వేసుకుని.. వాటిలో గాలి లేకుండా సున్నితంగా కవర్ మీద ఒత్తుతూ గాలిని పూర్తిగా తీసేసి ఎయిర్ టైట్ చేయాలి. అన్ని రకాల కూరగాయలు ఇలాగే జిప్ లాక్ చేసుకుని వీటిని డీప్ ఫ్రిజ్ లో భద్రపరుచుకోవాలి. ఇలా చేస్తే 6 నెలల వరకు కూరగాయలు పాడవ్వకుండా తాజాగా ఉంటాయి. మీకు అవసరం అయినప్పుడు నేరుగా డీప్ ఫ్రిజ్ లోంచి తీసి.. వండేసుకోవడమే. 

Latest Videos

click me!