గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తే ఏం చేయాలి?

First Published | Jun 11, 2024, 9:45 AM IST

గ్యాస్ స్టవ్ బాగా మండితేనే వంటలు చకాచకా పూర్తవుతాయి. కానీ కొన్ని రకాల వంటల వల్ల గ్యాస్ బర్నర్ రంధ్రాలు బ్లాక్ అవుతాయి. దీంతో స్టవ్ సరిగ్గా  మండదు. దీనివల్ల వంట చేయడానికి కూడా విసుగొస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయస్తే గ్యాస్ స్టవ్ మంట బాగా పండుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

gas burner cleaning

గ్యాస్ స్టవ్ కు రోజూ పనే ఉంటుంది. ఇది సరిగ్గా మండితేనే మనం వంటలను తొందరగా పూర్తిచేయగలుగుతాం. అయితే కొన్ని కొన్ని సార్లు మనం చేసే వంటల వల్ల గ్యాస్ బర్నర్ బ్లాక్ అవుతుంది. అంటే వంకాయను గ్యాస్ మీద వేయించడం, పాలను మరిగించడం వంటి చేస్తే మంట చిన్నగా వస్తుంది. ఎందుకిలా అవుతుంది? స్టవ్ పనిచేయడం లేదని చాలా మంది అనుకుంటుంటారు. రిపేర్ చేయిస్తారు. కొంతమంది అయితే పిన్నీసులు పెట్టేసి వాళ్లే రిపేర్ చేస్తుంటారు. కానీ కానీ దీన్ని మీరు చాలా ఈజీగా మండేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

బేకింగ్ సోడా, నిమ్మకాయ 

బేకింగ్ సోడా, నిమ్మకాయతో మూసుకుపోయిన గ్యాస్ బర్నర్ తెరుచుకుంటుంది. ఇందుకోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో 1 టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ నిమ్మరసం వేసి కలపండి. బేకింగ్ సోడా,నిమ్మకాయ నీటితో బర్నర్ ను బ్రష్ సహాయంతో రుద్ది బర్నర్ ను శుభ్రం చేయండి. ఇప్పుడు నీటితో కడిగేయండి. దీనివల్ల గ్యాస్ స్టవ్ బాగా మండుతుంది.
 


బేకింగ్ సోడా, వెనిగర్

బేకింగ్ సోడా, వెనిగర్ తో కూడా మీరు చిన్నగా మండే స్టవ్ ను బాగా మండేలా చేయొచ్చు. ఇందుకోసం 1 టీస్పూన్ బేకింగ్ సోడాకు 1 టీస్పూన్ వెనిగర్ ను కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేయండి. దీన్ని బర్నర్ పై అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేయండి.
 


బేకింగ్ సోడా, టూత్ పేస్ట్ 

బేకింగ్ సోడా మాత్రమే కాదు.. టూత్ పేస్ట్ ను కూడా మనం ఎన్నో ఇంటి అవసరాల కోసం ఉపయోగించొచ్చు. గ్యాస్ స్టవ్ బర్నర్ ను క్లీన్ చేయడానికి బేకింగ్ సోడా, టూత్ పేస్ట్ మిశ్రమాన్ని బర్నర్ అప్లై చేయండి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఇది మూసుకుపోయిన బర్నర్ రంధ్రాలను తెరుస్తుంది.

బేకింగ్ సోడా, ఉప్పు 

ఉప్పు, బేకింగ్ సోడా కూడా బర్నర్ మూసివేసిన రంధ్రాలను కూడా తెరవడానికి సహాయపడతాయి. ఇందుకోసం బేకింగ్ సోడా, ఉప్పు, నిమ్మరసాన్ని బాగా కలపండి.  బేకింగ్ సోడా, ఉప్పు మిశ్రమంతో బర్నర్ ను శుభ్రం చేయండి. ఆ తర్వాత నీళ్లతో శుభ్రంగా కడగండి.  
 

ఈనో, ఉప్పు 

గ్యాస్ బర్నర్ ను శుభ్రం చేయడానికి ఈనో, ఉప్పు, వెనిగర్ ను కలిపి వాడొచ్చు. ఇందుకోసం ఈ మూడింటిని కలపండి. దీన్ని బర్నర్ కు అప్లై చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి.

Latest Videos

click me!