Fridge Clean
ఫ్రిజ్ మనం ఎన్నో ఆహార పదార్థాలను పెడుతుంటాం. కూల్ డ్రింక్స్, ఫ్రూట్స్, రాత్రి మిగిలిన కూరలు, పచ్చళ్లు, పప్పులతో పాటుగా ఎన్నో ఆహారాలతో ఫ్రిజ్ ను మొత్తం నింపుతాం. కానీ మనలో చాలా మంది ఫ్రిజ్ లో పెట్టిన వాటిని మర్చిపోతుంటారు. ముఖ్యంగా కూరలు, కూరగాయలు, పండ్లను పట్టించుకోరు. కానీ కొన్ని రోజుల తర్వాత ఇవి పాడైపోతాయి. దీంతో ఫ్రిజ్ మొత్తం దుర్వాసన వస్తుంది. ఈ వాసన కక్కొచ్చేలా ఉంటుంది. అయితే చాలా మంది ఈ వాసన పోయేందుకు ఫ్రిజ్ ను మొత్తం క్లీన్ చేస్తారు. అయినా వాసన మాత్రం అలాగే వస్తుంటుంది. అయితే కొన్ని ట్రిక్స్ తో మీరు ఈ వాసనను చాలా సులువుగా పోగొట్టొచ్చు. ఎలాగో ఓ లుక్కేద్దాం పదండి.
ఫ్రిజ్ క్లీనింగ్
చాలా మందికి ఫ్రిజ్ ను క్లీన్ చేసే అలవాటే ఉండదు. పెట్టినవి పెట్టినట్టుగా ఉంచేస్తారు. ఫ్రిజ్ ను ఓపెన్ చేసినప్పుడు పాడైపోయిన వాటిని పారేస్తుంటారు. కానీ దీనివల్ల కూడా ఫ్రిజ్ వాసన వస్తుంటుంది. అందుకే మీ ఫ్రిజ్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. ఫ్రిజ్ లో ఏం ఉన్నాయి? అవి ఎన్ని రోజులకు పాడైపోతాయో తెలుసుకోండి. పాడైపోయిన ఆహారాలను వెంట వెంటనే పారేయండి. అలాగే కుళ్లిపోవడానికి దగ్గరగా ఉన్న పండ్లు, కూరగాయలను కూడా ఫ్రిజ్ లోంచి తీసేయండి. అలాగే ఏదైనా ఫ్రిజ్ లో ఒలికిపోతే వెంటనే తుడవండి. అల్మారాలు, డ్రాయర్లు, డోర్ సీల్స్ తో సహా రిఫ్రిజిరేటర్ లోపలి భాగాన్ని పూర్తిగా క్లీన్ చేయడం వల్ల వాసన రాదు.
బేకింగ్ సోడా
మీకు తెలుసా? బేకింగ్ సోడా ఒక పవర్ ఫుల్ సహజ డియోడరైజర్. ఇది ఫ్రిజ్ లోని వాసనలను తటస్తం చేయడానికి సహాయపడుతుంది. ఏదైనా వాసనను పోగొట్టడానికి లేదా వాసన రాకుండా ఉండేందుకు బేకింగ్ సోడాను ఒక చిన్న పేపర్ లో కట్టి.. ఫ్రిజ్ లేదా.. అల్వారాలో పెట్టండి. బేకింగ్ సోడా వాసన రాకుండా చేస్తుంది. లేదా చెడు వాసనను గ్రహిస్తుంది. బేకింగ్ సోడాను ప్రతి ఒకటి నుంచి మూడు నెలలకోసారి ఖచ్చితంగా మార్చాలి. ఎందుకంటే ఇది వాసనలను చాలా త్వరగా గ్రహిస్తుంది.
fridge cleaning
లోపలి ఉపరితలాలను తుడవడం
ఫ్రిజ్ ను ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉండాలి. ఎందుకంటే దీనిలో దుర్వాసన చాలా త్వరగా వస్తుంది. అందుకే మీ ఫ్రిజ్ లోపలి ఉపరితలాలను గోరువెచ్చన నీరు, తేలికపాటి డిటర్జెంట్ తో క్రమం తప్పకుండా తుడవాలి. అల్మారాలు, డ్రాయర్లు, డోర్ సీల్స్ ను కూడా తుడవండి. ఎందుకంటే ఇక్కడ ఆహార పదార్థాలు పడతాయి. ఒలికిపోతాయి. ఈ ప్రాంతాలను బాగా క్లీన్ చేయడానికి స్పాంజ్ లేదా బట్టను ఉపయోగించండి. వాసనకు కారణమయ్యే ఏదైనా అవశేషాలు లేదా బ్యాక్టీరియాను తొలగించండి. మీ ఫ్రిజ్ లోపలి భాగాన్ని శుభ్రంగా ఉంచడం వల్ల వాసనలు వచ్చే అవకాశం ఉండదు.
Fridge Clean
ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయడం
ఫ్రిజ్ లో మీరు ఫుడ్ ను పెట్టే విధానం కూడా వాసనకు కారణమవుతుంది. సరైన పద్దతిలో నిల్వ చేస్తే ఫుడ్ తాజాగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ముఖ్యంగా ఫ్రిజ్ వాసన వచ్చే ఛాన్సే ఉండదు. ఫ్రిజ్ వాసన రాకుండా ఉండేందుకు ఆహార పదార్థాలపై మూతలు గట్టిగా పెట్టండి. అలాగే వాటిలోకి గాలి వెల్లకుండా చూసుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, జున్ను బాగా వాసనొచ్చే వాటిని గాలివెల్లని డబ్బాలోనే నిల్వ చేయాలి.
fridge
సిట్రస్ తో రిఫ్రెష్ చేయండి
నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లు మీ ఫ్రిజ్ లో సహజ సువాసనన వచ్చేలా చేస్తాయి. ఇందుకోసం సిట్రస్ పండును సగానికి కట్ చేసి ప్లేట్లో లేదా మీ ఫ్రిజ్ లోపల ఒక చిన్న గిన్నెలో ఉంచండి. సిట్రస్ లోని ఆమ్ల లక్షణాలు దుర్వాసను పోగొడతాయి. అలాగే ఈ పండును ప్రతి వారం మార్చాలి.