ఎలాంటి పెర్ఫ్యూమ్ కొనాలో తెలుసా?

First Published Jun 18, 2024, 1:34 PM IST

ఎండాకాలంలో చెమట వల్ల వాసన రాకుండా ఉండటానికి డియోడరెంట్లు, పెర్ ఫ్యూమ్స్ ను ఎక్కువగా వాడుతుంటారు. అందుకే పెర్ఫ్యూమ్ లను తరచుగా కొంటుంటారు. కానీ పెర్ఫ్యూమ్స్ కోసం షాపింగ్ చేసేటప్పుడు ఒక్క వాసనపైనే కాకుండా కొన్ని విషయాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. 
 

ఎండాకాలంలో డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్స్ ను బాగా ఉపయోగిస్తారు. ఇవి ఎక్కువ సేపు బాడీ నుంచి చెమట వాసన రాకుండా రాకుండా ఉండటానికి పనిచేస్తాయి. అంతేకాదు పెర్ ఫ్యూమ్స్ మూడ్ ను ఫ్రెష్ గా ఉంచుతాయి. అలగే శరీరం నుంచి వచ్చే సువాసన మనల్ని సంతోషంగా ఉంచుతుంది. పెర్ ఫ్యూమ్ తో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీనిని కొనే ముందు మాత్రం కొన్ని విషయాలను బాగా గమనించాలి. చాలా మంది వాసన బాగుంటే చాలు పెర్ ర్ఫ్యూమ్ ను కొనేస్తుంటారు. కానీ ఒక్క వాసనే కాదు పెర్ఫ్యూమ్ ను కొనే ముందు ఎలాంటి విషయాలను గమనించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

పెర్ఫ్యూమ్ ను చాలా మంది దుస్తులకే కాకుండా డైరెక్ట్ గా శరీరానికి కూడా స్ప్రే చేయకూడదు. ముఖ్యంగా శరీర అంతర్గత భాగాలకు ఎప్పుడూ కూడా స్ప్రే చేయకూడదు. ఎందుకంటే ఇది అలెర్జీకి దారిస్తుంది. 
 

పెర్ఫ్యూమ్ ఎంత మంచి వాసన వచ్చినా.. అది మీ చర్మానికి పడుతుందా? లేదా? అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. ఇందుకోసం మీ మణికట్టుకు స్ప్రే చేయండి. పది నిమిషాల తర్వాత ఆ భాగంలో దురద లేదా నల్లని మచ్చలేమీ రాకపోతే అది మీ చర్మానికి అన్ని విధాలుగా సరిపోతుందని అర్థం చేసుకోండి. కానీ మీరు ఏ పెర్ఫ్యూమ్ కొన్నా ఈ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. 
 

Image: Getty

పెర్ఫ్యూమ్ ను కొనడానికి ముందు షాప్ లోపలే దాని సువాసనను చెక్ చేయండి. ఎందుకంటే స్టోర్ లోపల ఎయిర్ కండిషనింగ్ పెర్ఫ్యూమ్ వాసనను ప్రభావితం చేస్తుంది. అలాగే మీరు ఎంచుకున్న పెర్ఫ్యూమ్ వాసన ఎంత దూరం వరకు వ్యాపిస్తుందో తెలుస్తుంది. 

Image: Getty

ఎండాకాలంలో దుమ్ము, ధూళి, చెమట వల్ల సాయంత్రానికల్లా శరీరమంతా దుర్వాసన వెదజల్లుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీ శరీరం సహజ రసాయనాలతో సరిపోయే పరిమళ ద్రవ్యాలు మీకు మంచివి. వేసవిలో వేడిని, తేమను తట్టుకునేలా అధిక గాఢత కలిగిన పెర్ఫ్యూమ్ లను కొనాలి. పెర్ఫ్యూమ్ స్ప్రే చేసిన తర్వాత చర్మంపై మంట, జలదరింపు, తలనొప్పి ఉంటే వెంటనే పెర్ఫ్యూమ్ ను వాడటం మానేయాలి. 

Latest Videos

click me!