నకిలీ గోధుమ పిండిని ఎలా గుర్తించాలి?

First Published | Sep 5, 2024, 11:37 AM IST

ఈ రోజుల్లో ఏది అసలైందో? ఏది నకిలీదో? గుర్తుపట్టడమే కష్టంగా మారిపోయింది. తినే వాటి నుంచి అన్నీ కల్తీ అవుతున్నాయి. ఈ కల్తీ వాటిని తిని ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మనం కొనే గోధుమ పిండి అసలైందో, కాదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ప్రస్తుత కాలంలో మనం తినే ప్రతి పదార్థం కల్తీ అవుతోంది. ఈ కల్తీ ఆహారాలను తిని లేనిపోని రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా పండుగ సీజన్లలో నకిలీ పదార్థాలను కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పనీర్,  నెయ్యి, పిండి వంటి ఆహార పదార్థాల్లో నాణ్యత లోపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలోనే ఈ వస్తువులు ఎక్కువగా కల్తీ చేయబడతాయి.

ఒక్క పండుగలకే కాదు.. ఇతర సమయాల్లో కూడా చాలా ఆహార పదార్థాలు కల్తీ అవుతుంటాయి. కల్తీ నూనెలు, పిండి, మసాలా దినుసులు ఇలా మనం వాడే ప్రతి ఒక్కటీ కల్తీ అవుతుంటుంది. కానీ వీటిని గుర్తించి అలాంటి వాటిని కొనుగోలు చేయకుండా ఉండాలి.
 

చాలా మంది జొన్న పిండికంటే గోధుమ పిండినే ఎక్కువగా వాడుతుంటారు. ప్రతిరోజూ గోధుమ చపాతీలను తినేవారుంటారు. కానీ గోధుమ పిండి కూడా కల్తీ అవుతుంటుంది. కానీ కల్తీ గోధుమ పిండి మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చేలా చేస్తుంది. అందుకే కల్తీ గోధుమ పిండిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


ఇలా గుర్తించండి

పిండిని ప్రయోగశాల పరీక్షల ద్వారా కూడా నకీలీదో కాదో తెలుసుకోవచ్చు. అయితే దీనికోసం మీరు ప్రయోగశాలకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచి కూడా చేయొచ్చు. ఇందుకోసం మీరు టెస్ట్ ట్యూబ్ ను తీసుకోవాలి. దీనిలో కొంచెం గోధుమ పిండిని వేయండి. దీనికి హైడ్రోక్లోరిక్ యాసిడ ను కలపండి. 

ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపడం వల్ల అది కల్తీ అయ్యిందో? లేదో సులువుగా తెలుస్తుంది. దీంట్లో ఏదైనా వడపోత పదార్థం ఉంటే.. దాంట్లో సుద్ద కలిపినట్టు అర్థం. అయితే మీరు చెక్ చేయడానికి  మెడికల్ స్టోర్ నుంచి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కొనాల్సి ఉంటుంది. దీనిలో ఏమీ కనిపించ లేదంటే ఆ పిండి కల్తీ కాలేదని అర్థం చేసుకోండి.
 


వాసన చూడండి

గోధుమ పిండిని నకిలీదా? కాదా? అని దాని వాసన చూసి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే స్వచ్ఛమైన పిండి సువాసన రిఫ్రెష్ గా, తేలికపాటి తీయగా ఉంటుంది.ఈ పిండి వింత వాసన వస్తే మాత్రం అది కల్తీ అయ్యిందని అర్థం చేసుకోవాలి. అందుకే పిండిని కొనే ముందే దాని వాసన చూడండి. 

 నీళ్లతో చెక్ చేయండి

గోధుమ పిండిలో కల్తీ అయ్యిందా? లేదా? అన్న విషయాన్ని మీరు నీళ్లతో కూడా చాలా సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఒక గ్లాసులో నీళ్లను తీసుకుని అందులో అర టీస్పూన్ పిండిని వేసి కలపండి.

ఈ నీళ్లలో ఏదైనా తేలుతూ కనిపిస్తే అది కల్తీ అయ్యిందని అర్థం చేసుకోండి. ఎందుకంటే పిండిలో కల్తీ లేకపోతే నీటిలో ఎలాంటిది తేలదు. కల్తీ అయిన పిండిని ఉపయోగించకూడదు.
 

కాగితంతో టెస్ట్ చేయండి 

మీరు కాగితంతో కూడా చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒక కాగితం మీద కొంచెం పిండిని వేయండి. దీన్ని కాల్చండి. స్వచ్ఛమైన పిండితో కాలుతుంటే  మట్టి వాసన వస్తుంది. కానీ కల్తీ పిండి మాత్రం డిఫరెంట్ వాసన వస్తుంది. 
 

Wheat flour

గోధుమ పిండితో చీమలను  కూడా పోగొట్టొచ్చు.. ఎలాగంటే?

ప్రతి ఒక్కరి ఇంట్లో చీమలు కుప్పలు కుప్పలుగా ఉంటాయి. ఇవి గోడపై, ఫ్లోర్ మీద తిరుగుతూనే ఉంటాయి. అయితే వీటిని గోధుమ పిండితో చాలా సులువుగా తరిమికొట్టొచ్చు.

దీనికోసం చీమలు తిరిగే ప్రదేశంలో పిండిని వరుసగా పోయండి. దీనివల్ల కొద్ది సేపటికే చీమలు పిండి పోసిన ప్రదేశం నుంచి పారిపోతాయి. ఎందుకంటే చీమలకు పిండి వాసన నచ్చదు.  పిండి పిచికారీ చేసినా చీమలు ఒక్కటి లేకుండా పారిపోతాయి. 

Latest Videos

click me!