టవల్ ని ఎన్నిరోజులకు ఒకసారి ఉతకాలి?

First Published | Nov 6, 2024, 1:13 PM IST

మనమందరం రెగ్యులర్ గా బాత్ టవల్ వాడుతూనే ఉంటాం. రోజూ వాడుతూ ఉంటాం కాబట్టి క్రిములు ఎక్కువగా పట్టేస్తాయి. అందుకే, రెగ్యులర్ గా వాటిని ఉతుకుతూ ఉండాలి. మరి, ఎన్ని రోజులకు ఒకసారి టవల్స్ ఉతకాలో తెలుసుకుందాం..

మనం బాత్ టవల్స్ రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం.  మనం బయటకు వెళ్లివచ్చినప్పుడు బయట ఉండే బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు గాలి ద్వారా వ్యాపించి మన చర్మానికి అంటుకుంటాయి. దీని వల్ల చర్మం ఉపరితలంపై అనేక రకాల సూక్ష్మజీవులు పేరుకుపోతాయి. వాటిలో కొన్ని మాత్రం మన చర్మ సంబంధిత వ్యాధులకు కారణం అవుతాయి.

ఇలాంటి సమయంలో మనం స్నానం చేసి తర్వాత టవల్ ని ఉపయోగించినప్పుడు చర్మంలోని నీరు, బ్యాక్టీరియా టవల్ కి అంటుకుంటాయి. దీని వల్ల టవల్ లోని తేమ సూక్ష్మజీవులకు ఆహారంగా మారుతుంది. దీని కారణంగా బాక్టీరియా ఆ ప్రదేశంలో పెరగడానికి అనువైన వాతావరణం లభిస్తుంది.

అలాంటి పరిస్థితుల్లో మీరు టవల్ ని ఉతకకుండా మళ్లీ మళ్లీ ఉపయోగిస్తే, దానిలోని బాక్టీరియా మీ చర్మం, ముక్కు ద్వారా మీ శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. స్కిన్ ఎలర్జీలు రావడానికి కూడా కారణం అవుతుంది. ముఖ్యంగా మీరు ఆ టవల్ ని మీ ఇంట్లో పిల్లలతో, కుటుంబ సభ్యులతో పంచుకుంటే.. అది తీవ్రమైన హాని కలిగిస్తుంది. 


టవల్ ని ఉతకకుండా ఉపయోగిస్తే వచ్చే సమస్యలు:

మీరు ఉపయోగించే టవల్ ని చాలా రోజులు ఉతకకుండా అలాగే ఉంచితే, దానిలో మురికి , బాక్టీరియా పేరుకుపోతాయి. మీరు దానిని ఉపయోగించినప్పుడు, దానిలోని మురికి , బాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల మీ ముఖం , చర్మంపై మొటిమలు రావడానికి కారణం అవుతుంది.

దీనితో పాటు ముఖంపై దద్దుర్లు, నల్ల మచ్చలు వంటి చర్మ సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా మీకు ఇప్పటికే చర్మ సంబంధిత సమస్యలు ఉంటే, మురికి టవల్ ని మళ్లీ ఉపయోగించినప్పుడు మీ చర్మ సమస్య మరింత తీవ్రమవుతుంది.

టవల్ ని ఎన్నిసార్లు ఉతకాలి?

చర్మ సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, మీరు ఉపయోగించే టవల్ ని 2-3 సార్లు ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా ఉతకాలని నిపుణులు చెబుతున్నారు. లేదా వారానికి ఒకసారైనా ఉతికి ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. 

ఒక టవల్ ని ఒక వ్యక్తి మాత్రమే ఉపయోగిస్తే ఇలా చేయాలి. లేదంటే, ఇంటిలోని వారందరూ ఒకే టవల్ ని ఉపయోగిస్తే దానిని ప్రతిరోజూ ఉతకాలి. అలాగే టవల్ ని ఉతికి ఎండలో బాగా ఆరబెట్టిన తర్వాత ఉపయోగించండి.

2-3 రోజులకు ఒకసారి టవల్ ఉతికేవారు, టవల్ ని ఉపయోగించిన తర్వాత ప్రతిరోజూ ఎండలో ఆరబెట్టి ఉపయోగించాలని గుర్తుంచుకోండి. ఇలా చేయడం ద్వారా దానిలోని తేమ బయటకు వెళ్లిపోతుంది. క్రిములు ఉండే అవకాశం ఉండదు. ఇలా చేయకపోతే, క్రిముల వల్ల చర్మం దురద వచ్చి తీవ్రమైన చర్మ వ్యాధులకు గురవుతారు.

గమనిక : పైన చెప్పిన విషయాలను పాటించడం ద్వారా మీరు చర్మ సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు!!

Latest Videos

click me!