రోజుకు ఒక గంట సేపు వాకింగ్ చేస్తే సరిపోతుందా?

First Published | Aug 2, 2024, 2:55 PM IST

వాకింగ్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే రోజూ మీరు ఒక గంట పాటు నడిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 
 

వాకింగ్ అనేది ఎటువంటి స్పెషల్ పరికరాలు లేకుండా ప్రతి ఒక్కరూ సులభంగా చేయగలిగే ఒక గొప్ప ఎక్సర్ సైజ్. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా.. మన ఆరోగ్యానికి ఎన్నో  ప్రయోజనాలను అందిస్తుంది. ఏదేమైనా ఇతర రకాల వ్యాయామాలతో పోలిస్తే వాకింగ్ బరువు తగ్గడానికి చాలావరకు సహాయపడదని అనుకుంటారు. కాబట్టి రోజూ ఒక గంట పాటు నడిస్తే ఎలా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


కేలరీలు 

బరువు తగ్గాలంటే కేలరీలను బర్న్ చేయాలి. కేలరీలు బర్న్ కావడానికి చాలా ఈజీ మార్గం ప్రతి రోజూ వాకింగ్ కు వెళ్లడం. అవును నడిస్తే కూడా కేలరీలు బర్న్ అవుతాయి. అయితే మనం నడుస్తున్నప్పుడు బర్న్ చేసే కేలరీల సంఖ్య ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో మన శరీర బరువు, నడక వేగం కీలక పాత్ర పోషిస్తాయి. మీరు ఎంత వేగంగా నడిస్తే అన్ని ఎక్కువ కేలరీలను కరిగించగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. 


అయితే మీ శరీర బరువు 55 కిలోలు ఉండి.. మీరు గంటకు 3.2 కిలోమీటర్ల వేగంతో నడిస్తే గంటలో 108 కేలరీలను కరిగించగలుగుతారు.  అయితే మీరు గంటకు 4.8 కిలోమీటర్ల వేగంతో నడిస్తే 179 కేలరీలు, గంటకు 5.6 కిలోమీటర్ల వేగంతో నడిస్తే 206 కేలరీలు కరుగుతాయి. మీరు గంటకు 8 కిలోమీటర్ల వేగంతో నడిస్తే 489 కేలరీలను ఖర్చు చేయగలుగుతారు. 
 

గంటకు 4.8 కిలోమీటర్ల వేగంతో నడిచే 82 కిలోల వ్యక్తి గంటకు 270 కేలరీలు, 6.4 కిలోమీటర్ల వేగంతో నడిచే వ్యక్తి 410 కేలరీలు, 8 కిలోమీటర్ల వేగంతో నడిచే వ్యక్తి 738 కేలరీలు బర్న్ చేస్తాడని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదే వేగంతో గంట సేపు నడవడం సాధ్యం కాదు కాబట్టి మీ నడక వేగం సగటును లెక్కిస్తే సరిపోతుంది. 
 

అయితే మీరు బర్న్ చేసే కేలరీల సంఖ్య మీరు నడుస్తున్న ప్రదేశం, వాతావరణం, వయస్సు, లింగంపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే తారు రోడ్డుపై నడవడానికి, కఠినమైన రాళ్ల రోడ్డుపై  నడవడానికి తేడా ఉంది. సాధారణ ఉష్ణోగ్రత వద్ద నడవడం కంటే మండే ఎండలో ఒక గంట వాకింగ్ లేదా ఎక్కువ చలిలో నడవడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. 
 

అయితే ఒక గంట వాకింగ్ కూడా మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే మీరు రోజూ తినే ఆహారంలో కేలరీల మొత్తాన్ని లెక్కించండి. మీరు తినే  ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండేలా చూసుకోండి. తక్కువ కేలరీల ఆహారాన్ని తినండి. 

Latest Videos

click me!