ఇప్పుడిప్పుడే సంపాదించడం మొదలుపెట్టారా? ఈ తప్పులు మాత్రం చేయకండి..

First Published | Feb 18, 2024, 12:02 PM IST

డబ్బును సంపాదించడం మొదలుపెట్టిన కొత్తలో డబ్బును ఎలా పొదుపు చేయాలో తెలియదు. దీనివల్ల ఎన్నో తప్పులు చేస్తుంటారు. కానీ దీనివల్ల మీరు సంపాదించిన డబ్బంతా ఖర్చైపోతుంది. అందుకే ఇప్పుడిప్పుడే డబ్బును సంపాదించేవారు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

నేటి యువతరం చాలా చిన్న వయసులోనే తమ కాళ్లపై తాము నిలబడాలనుకుంటోంది. అందుకే యువత ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క పార్ట్ టైమ్ జాబ్స్ లేదా ఫ్రీలాన్స్ వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇది మంచి అలవాటు. సంపాదించడం స్టార్ట్ చేసినప్పుడు మీరు స్వయం సమృద్ధి సాధిస్తారు. కానీ ఇప్పుడిప్పుడే డబ్బును సంపాదించే వారికి డబ్బును పొదుపు చేయడం రాదు. కానీ మీరు చేసే కొన్ని తప్పులు మీ డబ్బు ఖర్చు అయ్యేలా చేస్తుంది. ఆ తప్పులేంటి? డబ్బును పొదుపు చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

బడ్జెట్ సెట్ చేయకపోవడం..

యువకులు తరచుగా చేసే సాధారణ తప్పు ఇది. నిజానికి యువకులు సంపాదించడం స్టార్ట్ చేసినప్పుడు.. వీళ్లకు కుటుంబ బాధ్యతలు ఉండవు. దీంతో వీళ్లు వారమంతా పనిచేసి.. వీక్లీ ఆఫ్ లో సంపాదించిందంతా ఖర్చు పెడుతుంటారు. కానీ ఇలా చేయడం మానుకోవాలి. అవసరాన్ని బట్టే ఖర్చు చేయండి. అతేకానీ అనవసరమైన వాటికి ఖర్చు చేయకండి. ఎప్పుడైనా ఖర్చు రావొచ్చు. అందుకే అత్యవసరం కోసం కొంత డబ్బును పక్కన పెట్టండి.
 



పెట్టుబడి 

సంపాదన వచ్చిన తొలినాళ్లలో చాలా మంది పెట్టుబడిపై అస్సలు దృష్టి పెట్టరు. అయితే ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిదని భావిస్తాయి. అయితే మీరు ఈ టైంలో మీరు రిస్క్ తీసుకోవచ్చు. ఎలాగూ మీకు కుటుంబ బాధ్యతలు లేకపోవడం వల్ల మీరు ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పెట్టుబడిగా పెట్టొచ్చు. ఇది మీకు మంచి రాబడిని ఇస్తుంది.
 


క్రెడిట్ కార్డు

మీరు ఇప్పుడిప్పుడే డబ్బు సంపాదిస్తున్నట్టైతే వెంటనే క్రెడిట్ కార్డును తీసుకోకండి. ఎట్టి పరిస్థితిలో దీనిని ఉపయోగించకండి. ఇప్పుడే డబ్బును సంపాదిస్తున్నారు కాబట్టి.. ఈ సమయంలో మీకు డబ్బును ఎలా నిర్వహించాలో తెలియదు. మీ జేబులో క్రెడిట్ కార్డు ఉంటే అనవసరంగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి మొదట్లో కొంత కాలం డెబిట్ కార్డును ఉపయోగించకండి. డబ్బును సరిగ్గా ఎలా పొదుపు చేయాలి? ఎలా ఖర్చు చేయాలో తెలుసుకున్న తర్వాత క్రెడిట్ కార్డును యూజ్ చేయండి. 

సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు

బట్టలు, ఫోన్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు మొదలైన వాటికి ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. మీ ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు అనవసరంగా ఖర్చు చేయడం వల్ల మీరు అప్పు చేయాల్సి వస్తుంది. కానీ ఇది మంచి అలవాటు కాదు. మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయకుండా మీ సామర్థ్యానికి లోబడి ఎలా జీవించాలో నేర్చుకోండి. 

Latest Videos

click me!