పాము చర్మం ప్రత్యేకం
పాములు తమ చర్మం నుంచే శబ్దాన్ని వినగలుగుతాయి. ఈ శబ్దం వాటి మెదడుకు వెళుతుంది. పాముల్లో ఉండే ఈ గుణాల వల్ల వాటిపై ఎవరు దాడి చేస్తున్నారో అవి ఈజీగా తెలుసుకోగలుగుతాయి.
అన్ని పాములు గుడ్లు పెట్టవు
అవును.. సరీసృపాలు క్షీరదాల కంటే చాలా భిన్నంగా ఉంటాయన్న సంగతిని స్కూళ్లోనే తెలుసుకుని ఉంటారు. ఎందుకంటే పాములు పిల్లలను కనకుండా గుడ్లు పెడతాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ సుమారు 70% పాములు మాత్రమే గుడ్లు పెడతాయట. మిగతా పాములు గుడ్లను పెట్టవు.
ముఖ్యంగా చల్లని వాతావరణంలో నివసించే పాములు గుడ్లు పెట్టకుండా పిల్లలను కంటాయి. ఎందుకంటే గుడ్లు చల్లని వాతావరణంలో మనుగడ సాగించవు.