కొంతమందిలో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి. టైం దొరికితే చాలా సెక్స్ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. దీనికోసం భాగస్వామిని పదే పదే ప్రాధేయపడుతుంటారు. కొన్నిసార్లు ఒత్తిడి కూడా తెస్తుంటారు.
undefined
శృంగారం శారీరక, మానసిక ఆరోగ్యాలకు మంచిదే అయినా మితిమీరిన శృంగార కోరికలు అంత మంచివి కావంటున్నారు. ఒంటికి ఒళ్లు పెనవేసుకుని సాగించే క్రీడమీద ఎంత తహతహ ఉన్నా.. కాస్త అదుపు కూడా అవసరం అంటున్నారు. అదుపుతప్పితే వైవాహిక జీవితమే అదుపుతప్పే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
undefined
శృంగారం మత్తెక్కించే మల్లెపూల వాసనలా హాయిగా ఉండాలి కానీ మద్యంలా వ్యసనం కాకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మితిమీరిన శృంగార కోరికలకు యువత బానిసలుగా మారుతున్నారు. దీనికోసం పక్కదారులూ పడుతున్నారు.
undefined
ఇలాంటి శృంగార వ్యసనాల వల్ల వైవాహిక జీవితం నాశనం అవుతుందట. ఎందుకంటే మీరు ఆలోచించేదే మీ మాటల్లో, చేతల్లో బయటపడుతుంది. మితిమీరిన ఆ యావ చివరికి తీవ్ర నిరాశకు గురిచేస్తుందట. దీన్ని తీర్చుకోవడం కోసం భాగస్వామిని మోసం చేయడం, పోర్న్ కు అలవాటు పడడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయట.
undefined
చేతిలో ఫోన్.. దానికి డాటా ఇంకేం.. నీలి చిత్రాలకు అదుపు లేదు. దీంతో హస్త ప్రయోగానికి అలవాటు పడు అసలు శృంగారంలోని మజాను మరిచి పోతున్నారట. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయంటున్నారు నిపుణులు.
undefined
పెళ్లైన కొత్తలో ఈ మితిమీరిన శృంగార కాంక్ష బాగానే ఉంటుంది. కానీ రోజుల గడిచే కొద్ది ఆడవారికి ఇంటి బాధ్యతలతో కొంత ఆసక్తి తగ్గుతుంది. ఇది పురుషుడిలో అసహనానికి దారి తీస్తుంది. దీంతో వివాహేతర సంబంధాలవైపు మొగ్గ చూపుతారు. అందులో కూరుకుపోయి భార్య అడ్డు తొలగించుకునే ఆలోచనలు కూడా చేస్తారు.
undefined
ఇక భాగస్వామిని మోసం చేయడంతో మొదలయ్యే ఈ లైంగిక వ్యసనంతో కాపురం కల్లోలాల బాట పడుతుంది. నైతిక సమస్య రూపం తీసుకుంటుంది. మీరు ఎవ్వరు చెప్పినా మీది తప్పని ఒప్పుకోని స్థితికి చేరుకుంటారు.
undefined
శృంగారానికి బానిసలవ్వడం వల్ల మానసిక ఆరోగ్యమూ దెబ్బతింటుంది. ప్రతి నిముషం మీ వివాహేతర సంబంధమో మీరు చేసే పనో బయటపడకుండా కవర్ చేయడానికి ప్రయత్నించి.. ప్రయత్నించి అలిసిపోతారు. దీంతో సంతోషం మీకు దూరమవుతుంది. ఇంట్లో తరచూ గొడవలు, అశాంతి మొదలవుతాయి.
undefined
శృంగార బానిసత్వం నుంచి బయటపడలేమా అంటే అసలు అది సమస్య ఉంది అని గుర్తించగలగడమే మొదటి మెట్టు. అలా గుర్తించగలిగితే చికిత్స సాధ్యమే.
undefined
ముందుగా తన భాగస్వామికి ఈ సమస్య ఉందని గుర్తించేది వారి జీవితభాగస్వాములే. సరైన సమయంలో కనుక దీనికి చికిత్స జరగకపోతే వివాహం కాస్తా విడాకుల దాకా వెళ్లే ప్రమాదం ఉంది.
undefined
ఈ మితిమీరిన శృంగార కోరికలు మనిషి మీద నమ్మకాన్ని పోగొడతాయి. మత్తుపదార్థాల కంటే లైంగిక వ్యసనం చాలా ప్రమాదకరం, ఆరోగ్యానికి హానికరం. స్త్రీ అయినా, పురుషుడైనా ఒకవేళ తమలో ఇలాంటి కోరికలు ఎక్కువగా కలుగుతున్నట్లైతే కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
undefined