రాత్రి పూట ఈ డ్రింక్ తాగి నిద్రపోతే.. ఉదయానికి మీ కడుపు ప్రీ అవుతుంది..

First Published | Jul 21, 2024, 1:22 PM IST

చాలా మందికి కడుపు ఫ్రీగా లేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ మలబద్దకం సమస్య ఎంతో మందికి ఉంటుంది కానీ ఎవ్వరికీ చెప్పుకోరు. ఇలాంటి వారు కడుపును ఫ్రీగా చేయడానికి రాత్రిపూట కొన్ని డ్రింక్స్ ను తాగి పడుకుంటే ఉదయానికి మీ కడుపులోని ఆహార వ్యర్థాలు బయటకు పోతాయి. 
 

constipation

ఫైబర్ కంటెంట్ లేని ఆహారాన్ని తినడం, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను రోజూ తినడం వల్ల మన జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇది కొన్ని రోజుల్లో  ప్రమాదకరమైన మలబద్దకానికి దారితీస్తుంది. అయితే మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మాత్రం ఈ సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు.

ప్రస్తుత కాలంలో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. తెల్లవారు జామున టాయిలెట్ కు వెళ్లేవారు.. కడుపును సరిగ్గా శుభ్రం చేయకుండానే మలవిసర్జన చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఆహారంలో ఫైబర్ లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు ఉండటం. చెడు ఆహారపు అలవాట్లు ఉన్నవారికే ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లను మెరుగుపరిస్తే.. ఈ సమస్య నుంచి బయటపడతారు. ముఖ్యంగా రాత్రిపూట కొన్ని పానీయాలను తాగి పడుకుంటే ఉదయానికి పొట్ట శుభ్రం అవుతుంది. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 


త్రిఫల నీరు

త్రిఫల అనేది మూడు పదార్థాలతో కూడిన ఆయుర్వేద రసాయనం. ఇది మన పేగుల్లో పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒక చెంచా త్రిఫల చూర్ణాని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే పొట్ట శుభ్రపడుతుంది. పొట్టలోని మలినాలు బయటకుపోతాయి. త్రిఫల నీటిని తాగడం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 

ఉసిరి రసం

ఉసిరి కాయలను తింటే కూడా మలబద్దకం సమస్య నుంచి బయటపడతారు. ఉసిరిరసాన్ని ఉదయం పరిగడుపున తాగాలి. ఈ రసాన్ని రాత్రిపూటే తయారుచేయాలి. ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉసిరి రసం వేసి రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని ఉదయాన్నే మరిగించి, చల్లారిన తర్వాత తాగాలి. ఉసిరి రసం కడుపుని శుభ్రపరుస్తుంది. అలాగే పేగులలో పేరుకుపోయిన మలాన్ని సులభంగా తొలగిస్తుంది.
 

వెచ్చని పాలలో కాస్టర్ ఆయిల్

ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో 4 నుంచి 5 చుక్కల ఆముదాన్ని కలపండి. దీన్ని రాత్రి పడుకునే ముందు తాగండి. అయితే మీకు పాలతో అలెర్జీ ఉన్నా లేదా మీ జీర్ణక్రియ చెడిపోయి ఉన్నా.. పాలు తాగడం వల్ల ఈ సమస్య ఎక్కువైతే.. మీరు వేడి నీటిలో 2 చెంచాల ఆవాల నూనె వేసి తాగండి. 
 

అవిసె గింజలు

అవిసె గింజల్లో కరిగే, కరగని ఫైబర్స్ రెండూ ఉంటాయి. ఈ రెండు ఫైబర్లు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల మలం మృదువుగా మారుతుంది. ఈ గింజల్లోని కరగని పీచు పేగులకు అతుక్కుపోయిన మలాన్ని మృదువుగా చేసి కడుపులోంచి బయటకు వెళ్లేలా చేస్తుంది. అవిసె గింజలు గొంతులో ఇరుక్కుపోయే అవకాశం ఉంటాయి. అందుకే వీటిని పచ్చిగా తినకూడదు. ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ అవిసె గింజలను గోరువెచ్చని నీటిలో లేదా పాలలో రాత్రంతా నానబెట్టి పొద్దున్నే తాగాలి. 

ఖర్జూరాలు

మలబద్ధకం ఉన్నవారికి ఖర్జూరాలు మంచి మేలు చేస్తాయి. మలబద్దకం సమస్య ఉన్నవారు ఖర్జూరాలను నెయ్యితో కలిపి తింటే త్వరగా ఉపశమనం కలుగుతుంది. అయితే ఇందుకోసం నెయ్యిలో ఖర్జూరాన్ని కాసేపు నానబెట్టాలి. ఖర్జూరాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీవక్రియను పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. ఖర్జూరాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలం మృదువుగా మారుతుంది. 

Latest Videos

click me!