వాచ్ ను ఎడమ చేతికే ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

First Published | Nov 2, 2024, 10:03 AM IST

ఒకప్పటి నుంచైనా ఆడవాళ్లు, మగవారు ఎడమ చేతికే వాచ్ ను పెట్టుకుంటున్నారు. అసలు ఈ చేతికే ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనకున్న అసలు రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఒకప్పుడు కేవలం మగవారు మాత్రమే చేతికి వాచ్ ను పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు మగవారు, ఆడవాళ్లు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాచ్ ను మెయింటైన్ చేస్తున్నారు. అది కూడా చాలా మంది స్మార్ట్ వాచ్ నే వాడుతున్నారు. 

అయితే మగవారితో పాటుగా ఆడవాళ్లు కూడా ఎన్నో ఏండ్లుగా వాచ్ ను ధరిస్తూ వస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఈ వాచ్ ను ఎడమ చేతి మణికట్టుకు మాత్రమే పెట్టుకుంటుంటారు. కుడి చేతికి ఎందుకు పెట్టుకోరు అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది.

కానీ దీనికి ఆన్సర్ మాత్రం ఎవ్వరికీ తెలియదు. అందుకే ఇప్పుడు వాచ్ ను ఎడమ చేతికి పెట్టుకోవడం వెనకున్న అసలు కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

కుడిచేతిలో గడియారాన్ని ఎందుకు పెట్టుకోకూడదు? 

మనలో ప్రతి ఒక్కరూ పనులన్నింటినీ చేయడానికి ఎడమ చేతికంటే కుడి చేతినే ఎక్కువగా ఉపయోగిస్తాం.కాబట్టి గడియారాన్ని ఈ చేతికి పెట్టుకుంటే పనులు చేయడానికి ఇబ్బంది కలుగుతుంది. అంతేకాక అది పగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే కుడి చేతికి బదులుగా ఎడమ చేతికే గడియారాన్ని పెట్టుకుంటారు. 

పని సౌలభ్యం

ఎడమ చేతికి గడియారాన్ని పెట్టుకోవడం వల్ల మనం కుడి చేతితో టైపింగ్ చేయడం, రాయడం వంటి పనులు చాలా సులువుగా పూర్తి అవుతాయి. వాచ్ వల్ల పనులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే కుడి చేతికి బదులుగా ఎడమ చేతికి వాచ్ ను పెట్టుకుంటారు. 
 


ధరించే సౌలభ్యం

చైన్ లేదా స్ట్రాప్ గడియారాన్ని పెట్టుకున్నప్పుడు దానిని ఎడమ చేతితో కుడిచేతికి పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అసలు ఎడమచేతితో గడియారాన్ని పెట్టుకోవడమే రాదు. అదే కుడిచేతితో ఎడమ చేతికి గడియారాన్ని చాలా సులువుగా పెట్టుకుంటాం.

అయితే కానీ ఎడమచేతివాటం ఉన్నవారు మాత్రం ఎడమ చేతితో కుడిచేతికి ఈజీగా వాచ్ ను పెట్టుకుంటారు. అలాగే వీరికి కుడిచేతికి వాచ్ ను పెట్టుకోవడమే సౌకర్యవంతంగా ఉంటుంది. 

పగిలిపోతుందనే భయం

చాలా వాచ్ లకు గ్లాస్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇలాంటి వాచ్ ను మనం కుడిచేతికి పెట్టుకుని రకరకాల పనులను చేస్తుంటే.. దేనికో ఒక దానికి తగిలి అది పగిలిపోతుందనే భయం చాలా మందికి ఉంటుంది. అలాగే గ్లాసుకు ఏదైనా గీసుకుపోవచ్చు. అందుకే కుడి చేతికి గడియారాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడరు. 

వాచ్ సురక్షితం

మనం దాదాపుగా అన్ని పనులను కుడి చేతితోనే చేస్తుంటాం. కాబట్టి వాచ్ ను ఎడమ చేతికి పెట్టుకుంటేనే గడియారం పగిలిపోకుండా సురక్షితంగా ఉంటుంది. అలాగే ఏ పనిచేసినా దానిపై ఒక్క గీత కూడా పడదు. 

గడియారం ధరించిన చరిత్ర

మీకు తెలుసా? పూర్వకాలంలో  చేతులకు గడియాలను పెట్టుకునేవారే కాదు. అయితే  చిన్న గడియారాలను మాత్రం జేబులో పెట్టుకునేవారు. దీనివల్ల అది ఏదైనా తగిలి పగిలిపోతుంది, విరిగిపోతుందనే భయం వారిలో ఉండేది. 

ఎడమ చేతికి గడియారం ధరించే ట్రెండ్

దక్షిణాఫ్రికాలో రైతుల యుద్ధం మొదలైనప్పుడు జేబులో పెట్టుకున్న గడియారం పగిలిపోతుందనే భయంతో అప్పటి నుంచి అధికారులు గడియారానికి బెల్టులు ధరించి చేతికి పెట్టుకోవడం ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి ఎడమ చేతికి గడియారాన్ని పెట్టుకునే ట్రెండ్ నేటికీ కొనసాగుతూనే ఉంది.

Latest Videos

click me!