2024లో అత్యధిక సాలరీలున్న టాప్ 5 జాబ్స్ ఇవే...

First Published | Jul 30, 2024, 8:09 PM IST

ఏ ఉద్యోగి అయినా కోరుకునేది మంచి సాలరీ. ఇలా ఎక్కువగా సాలరీ వచ్చే ఉద్యోగాలనే ఎవరైనా కోరుకుంటారు. మరి మన దేశంలో ఎక్కువ జీతాలు వచ్చే టాప్ 5 జాబ్స్ ఏవో తెలుసా..? 

Highest Paying Jobs in India

Highest Paying Jobs in India : డబ్బుకు లోకం దాసోహం... ఇదే నేటి సమాజంలో పరిస్థితి. డబ్బులే మనిషి జీవితాన్ని నడిపిస్తోంది... కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఓ రైతు తన పంటకు మంచి ధర రావాలని... వ్యాపారి మంచి లాభాలు రావాలని కోరుకుంటారు. అలాగే ఉద్యోగి కూడా మంచి జీతం కోరుకుంటాడు. పనిభారం ఎక్కువున్నా మంచి సాలరీ వుంటే కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకునేవారే చాలామంది. మొత్తంగా మంచి సాలరీ వుంటే అది మంచి జాబ్ అన్నమాట.   

Highest Paying Jobs in India

ఈ పోటీ ప్రపంచంలో అసలు మంచి జాబ్ ఏది..? ఏ ప్రొఫెషన్ లో మంచి జాబ్స్ వున్నాయి? మార్కెట్ లో ఏ జాబ్ కు ఎంత జీతం వస్తుంది..? అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇండియాలో అత్యధిక జీతాలు కలిగిన జాబ్స్ ఏవో తెలుసుకుందాం. 
 


Highest Paying Jobs in India

అత్యధిక సాలరీస్ కలిగిన టాప్ 7 జాబ్స్ : 

1. చార్టర్డ్ అకౌంటెంట్..: 

ఆర్థిక లావాదేవీలతో ముడిపడిన జాబ్ చార్టర్ అకౌంటెంట్. వ్యాపారసంస్థలు, వ్యక్తుల ఆదాయవ్యయాల లెక్కలుచూసేది ఈ సిఏలే. ఇలా ఆడిటింగ్, టాక్సేషన్, ఫైనాన్సియల్ వ్యవహారాలు చూసే సీఏ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ వుంది. అత్యధిక సాలరీలను పొందే జాబ్స్ లో ఈ సీఏ ఒకటి.  

Highest Paying Jobs in India

ఇండియాలో పనిచేసే చార్టర్ అకౌంటెంట్ సాలరీ ఏడాదికి సగటున రూ.10 లక్షల వరకు వుంటుంది. మంచి ప్రతిభ కలిగిన సీనియర్లు, మంచి సంస్థలో పనిచేస్తుంటే సాలరీ ఎక్కువగా వుంటుంది. మొత్తంగా సీఏలకు అత్యధికంగా రూ.30 లక్షల వరకు సాలరీ వుంటుంది. ఇలా హయ్యెస్ సాలరీ జాబ్స్ లిస్ట్ లో సీఏ ఒకటి.   
 

Highest Paying Jobs in India

2. మెడికల్ ప్రొఫెషనల్ : 

వైద్య రంగం... ప్రస్తుతం చాలా డిమాండ్ వున్న రంగం. కాబట్టి ఈ రంగంలో పనిచేసేవారికి కూడా మంచి డిమాండ్ వుండటం సహజం. ముఖ్యంగా డాక్టర్లు, వైద్య నిపుణులు రెండుచేతులా సంపాదిస్తుంటారు. మిగతా వైద్య సిబ్బందికి కూడా మంచి జీతాలే వుంటాయి. 

మెడికల్ ఫీల్డ్ లో పనిచేసేవారికి సగటును రూ.10 లక్షల వరకు జీతాలుంటాయి. అత్యధికంగా రూ.35 లక్షల వరకు జీతాలు పొందుతుంటారు. ఇలా అత్యధిక సాలరీలు కలిగిన జాబ్స్ లో మెడికల్ ప్రొఫెషనల్ ఒకటి.   
 

Highest Paying Jobs in India

3. ప్రోడక్ట్ మేనేజ్ మెంట్ : 

వ్యాపార రంగంలో వస్తు ఉత్పత్తి కీలక ప్రక్రియ.  ఓ వస్తువు కొనేటప్పుడు అది ఎలా వుంది..? మనకెంత ఉపయోగకరం..? అనేది చూస్తుంటాం. ఇలా మార్కెట్ అవసరాలకు తగ్గట్లు ఓ వస్తువు తయారీ, అభివృద్ది చేయడమే ప్రోడక్ట్ మేనేజ్ మెంట్. 

ఈ ప్రోడక్ట్ మేనేజ్ మెంట్ ఫీల్డ్ లో పనిచేసేవారు మంచి జీతాలనే పొందుతున్నారు. సగటును రూ.10 లక్షల నుండి అత్యధికంగా రూ.30 లక్షలు పొందేవారు కూడా వున్నారు.   
 

Highest Paying Jobs in India

4. పైలట్స్ : 

విమానాలను నడిపేవారిని పైలట్స్ అంటారు. ఇది ఎంతో బాధ్యతతో, సమయానికి తగ్గట్లు ఆలోచిస్తూ నిర్వహించాల్సిన జాబ్. ఏ చిన్న  తప్పు చేసిన చాలామంది ప్రాణాలు రిస్క్ లో పడతాయి. కాబట్టి మంచి శిక్షణ పొందినవారికే పైలట్లుగా నియమించుకుంటాయి విమానయాన కంపనీలు. ఇలా మంచి ప్రొఫెషనల్స్ ను నియమించుకున్నపుడు సాలరీ గా కూడా ఆ స్థాయిలోనే ఇవ్వాల్సి వుంటుంది. 

పైలట్లు సగటును రూ.37 లక్షల జీతాన్ని కలిగివుంటారు.అత్యథికంగా రూ.85 నుండి రూ.90 లక్షల వరకు పైలట్ల సాలరీలు వుంటాయి. 
 

Highest Paying Jobs in India

డాటా సైంటిస్టులు, మార్కెటింగ్ డైరెక్టర్లు : 

భారతదేశంలో అత్యధిక జీతాలు కలిగిన జాబ్స్ డాటా సైంటిస్ట్, మార్కెటింగ్ డైరెక్టర్స్. వీరికి రూ.50 లక్షల నుండి కోటి రూపాయలకు పైగా జీతాలుంటాయి. ఏ కంపనీకి మంచి మార్కెంటింగ్ మెలకువలు వుంటాయో ఆ కంపనీ మంచి లాభాలను పొందుతుంది... ఈ మార్కెటింగ్ వ్యవహారాలకు సంబంధించినవే ఈ జాబ్స్. అందువల్లే ఈ స్థాయిలో సాలరీస్ ఇస్తుంటాయి కంపనీలు. 

Latest Videos

click me!