కరీనా కపూర్ కు ఇష్టమైన యోగాసనంతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

First Published Jun 13, 2024, 4:32 PM IST

యోగాసనాలు ఎన్నో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అందుకే సెలబ్రిటీలు నిత్యం యోగసానాలు చేస్తారు. వీరిలో కరీనా కపూర్ ఒకరు. ఈ బాలీవుడ్ బ్యూటీకి ఒక యోగాసనం ఎంతో ఇష్టమట.  ఈ యోగాసనం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు.
 

యోగా వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. యోగా మన శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా తయారుచేయడంతో పాటుగా మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. యోగాతో  ఒకటి కాదు రెండు కాదు ఎన్నో శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే బాలివుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ కూడా రోజూ యోగాసనాలు చేస్తుంది. సోషల్ మీడియాలో తనకు ఎంతో ఇష్టమైన యోగాసనం ఏంటో తెలిపింది. కరీనా కపూర్ కు చక్రాసనం అంటే ఎంతో  ఇష్టమట. మరి దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

శ్వాస సమస్య నుంచి ఉపశమనం

చక్రాసనంతో ఊపిరితిత్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. చక్రాసనం వేయడం వల్ల ఊపిరితిత్తులు విస్తరిస్తాయి. ఈ యోగాసనాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి బయటపడతారు. 
 

Chakrasana


బలమైన వెన్నెముక

చక్రాసనం ప్రతిరోజూ చేయడం వల్ల మీ శరీరంలో వశ్యతను మెరుగుపడుతుంది. అలాగే ఈ చక్రాసనం మన వెన్నెముకను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది వెన్నునొప్పిని తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. 

మానసిక ఆరోగ్యం

చక్రాసనం వేసే సమయంలో రక్తం మెదడు కణాలకు ఎక్కువ ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

జుట్టు, చర్మం

చక్రాసనం సమయంలో ముఖానికి, నెత్తిమీదకు రక్త ప్రవాహం బాగా పెరుగుతుంది. దీంతో  ముఖ చర్మం అందంగా మెరుస్తుంది. అలాగే వెంట్రుకలు కూడా షైనీగా కనిపిస్తాయి. వెంట్రుకలు ఊడిపోయే ప్రమాదం తగ్గుతుంది. 


మెరుగైన నిద్ర

చక్రాసనం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. మీ మనసు శాంతపడుతుంది. ప్రతిరోజూ సాయంత్రం పూట ఈ ఆసనం వేస్తే రాత్రి పూట మీకు హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యలున్నవారికి ఈ ఆసనం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.

Latest Videos

click me!