టాలీవుడ్ మన్మథుడు ఈ వయసులోనూ ఇంత ఫిట్ గా ఉండటానికి కారణమేంటో తెలుసా? సీక్రేట్ బయటపెట్టిన నాగార్జున

First Published | Jul 19, 2024, 10:47 AM IST

నాగార్జున వయసు ప్రస్తుతం 64 ఏండ్లు. కానీ ఈ హీరో అలా ఏనాడైనా కనిపించాడా? 64 ఏండ్ల వయసైనా.. 24 ఏండ్ల పడుచు పిల్లాడిలా కనిపిస్తూ..అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాడు. అసలు నాగార్జున ఇలా ఉండటానికి సీక్రేట్ ఏంటో తెలుసా? 
 

ఏండ్లు గడుస్తున్నా.. టాలీవుడ్ మన్మథుడి క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేనేలేదు. ఎంతో మంది కుర్ర హీరోలు సినీ రంగంలోకి వస్తున్నారు.. పోతున్నారు.. కానీ అక్కినేని హీరో మాత్రం ఆఫర్ల మీద ఆఫర్లను అందుకుంటూనే ఉన్నాడు. అసలు నాగార్జున వయసు ఎంత అంటే ఏం చేప్తారు. ఏముంది మహా అయితే 35 నుంచి 40 ఏండ్లు ఉన్నాయనుకుంటారు. కానీ ఈ హీరో వయసు  64 ఏండ్లు. కానీ ఇలా అస్సలు కనిపించరు కదా. 
 

ఈ టాలీవుడ్ మన్మథుడి వయసును ఆయనను చూసి అస్సలు అంచనా వేయలేం. ఎందుకంటే ఈ హీరో లుక్స్ అంత యంగ్ గా కనిపిస్తాయి. నిజానికి దీని వెనుక పెద్ద సీక్రేటే ఉంది తెలుసా? అవును అక్కినేని హీరో ఇంత ఫిట్ గా కనిపించడానికి కొన్ని పనులు  చేస్తారట. అవి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జునే చెప్పారు. ఇంకెందుకు ఆలస్యం.. నాగార్జున ఫిట్ నెస్ సీక్రేట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు కానీ.. అక్కినేని నాగార్జున అస్సలు డైట్ ను మెయింటైన్ చేయరట. అంతేకాదు ఈయనకు ఏం తినాలనిపిస్తే అది తింటారట. అది కూడా కడుపు నిండా. ఈయన వైట్ రైస్ తిన్నా.. కొంచెమైనా బ్రౌన్ రైస్ తింటారట. అలాగే ఆకు కూరలు, చికెన్, ఫిష్ కూడా ఖచ్చితంగా తింటారట. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే? ఈ హీరో రోజూ పెరుగును ఖచ్చితంగా తింటారట. ఇక రాత్రి పూట ఏడు గంటలకే డిన్నర్ ను కంప్లీట్ చేస్తారట. 
 

Nagarjuna Akkineni

నాగార్జున రాత్రిపూట స్వీట్ ను కూడా తింటారట. అలాగే ఆకలి వేస్తే నచ్చినవన్నీ తినేసి పడుకుంటారట. మరి ఇన్ని తిని అస్సలు బరువు పెరగరేం అని మీకు డౌట్ రావొచ్చు. ఈ హీరో దీనికి కూడా సమాధానమిచ్చారు.  నాగార్జున ఎంత తిన్నా.. ఉదయం ఖచ్చితంగా వర్కౌట్స్ చేస్తారట. వర్కౌట్స్ తో కేలరీలను కరిగించి ఫిట్ గా ఉంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 
 

తింటే బరువు పెరుగుతారనేది నిజమే. కానీ తిన్నా.. కేలరీలను కరించేందుకు శారీరక శ్రమ చేయాలి. అప్పుడే మీరు ఎంత తిన్నా.. బరువు పెరగకుండా  ఉంటారు. ఎలాంటి వ్యాధులు రాకుండా హెల్తీగా ఉంటారు. నాగార్జున చూడండి.. ఎలాంటి డైట్ మెయింటైన్ చేయకున్నా.. ఎంత యంగ్ గా, హెల్తీగా, ఫిట్ గా ఉన్నారో.. 

Latest Videos

click me!