చలికాలంలో పెదాలు పగిలితే ఇలా చేయండి..

Published : Jan 05, 2023, 10:58 AM ISTUpdated : Jan 05, 2023, 10:59 AM IST

చలికాలంలో పెదాలు పగలడం చాలా కామన్. అయితే పెదాలను మృదువుగా చేయడానికి హైడ్రేట్ గా చేయడానికి కొన్ని చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే..   

PREV
18
 చలికాలంలో పెదాలు పగిలితే ఇలా చేయండి..

పెదాలకు లిప్ స్టిక్ పెట్టుకోవడం చాలా మందికి ఇష్టముంటుంది. ఎందుకంటే లిప్ స్టిక్ పెదాలను అందంగా, ఆకర్షణీయంగా మారుస్తుంది కాబట్టి. కానీ పెదాలకు లిప్ స్టిక్ ను ఎప్పుడూ పెట్టడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనిలో ఎన్నో రకాల కెమికల్స్ ఉంటాయి. ఇవి పెదాలకు చిరాకు పెడతాయి. మీ పెదాల నేచురల్ రంగును మారుస్తాయి. ఇదంతా పక్కన పెడితే.. అసలు లిప్ స్టిక్ పెట్టుకోవాలన్నా.. పెదాలు డ్రైగా ఉండకూడదు. అలాగే పగలపకూడదు. ఇలా ఉన్నప్పుడు లిప్ స్టిక్ పెట్టుకున్నా.. సెట్ కాదు. పగిలిన పెదాలు అందంగా మారాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

28

శీతాకాలంలో  పెదాలు పగలడానికి కారణాలు 

చలికాలంలో బయట వీచే చల్లని గాలులు, ఇంట్లో ఉండే వెచ్చని వేడి గాలి వల్ల పెదాలు పొడిబారి పగులుతుంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చల్లని, పొడి వాతావరణం, సూర్యరశ్మి, పెదవులను పదే పదే నాలుకతో తడపడం వంటి కారణాల వల్ల చలికాలంలో పెదాలు పగులుతుంటాయి. పోషకాల లోపం వల్ల కూడా పెదాలు పగులుతుంటాయని నిపుణులు అంటున్నారు.   
 

38

చికాకు పెట్టే లిప్ బామ్స్ వాడండి

కర్పూరం, యూకలిప్టస్, దాల్చినచెక్క, సిట్రస్, పుదీనా, పిప్పరమింట్, సువాసన, లానోలిన్, మెంతోల్, ఆక్టినోక్సేట్, ఫినాల్ వంటి మంచి సువాసనొచ్చే లిప్ బామ్స్ ను వాడకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి పెదవులను చికాకుపెడతాయి. లిప్ బామ్ అప్లై చేసిన చికాకుగా అనిపిస్తే.. ఇకపై వాటిని పెట్టకండి. అలాగే ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన లిప్ బామ్ లను కూడా ఉపయోగించకండి. 
 

 

48

పెట్రోలియం జెల్లీ

సిరామైడ్లు, డైమెథికోన్, పెట్రోలాటమ్, షియా వెన్న, వైట్ పెట్రోలియం జెల్లీ వంటి వాటిని కలిగున్న లిప్ బామ్ లను ఉపయోగించండి. మీ పెదాలు పొడిబారితే  వైట్ పెట్రోలియం జెల్లీని ఉపయోగించండి. ఈ లిప్ బాల్  మీ పెదాలను  తేమగా ఉంచుతుంది. అలాగే పెదవులను మృదువుగా ఉంచుతుంది. 
 

58

లిప్ సన్స్క్రీన్

పెదాలను అందంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మాయిశ్చరైజింగ్ SPF లిప్ బామ్ చక్కగా ఉపయోగపడుతుంది. మీ పెదాలను ఆరోగ్యంగా ఉంచడానికి  టైటానియం డయాక్సైడ్, జింక్ ఆక్సైడ్ వంటి సన్ ప్రొటెక్టివ్ ఏజెంట్లను ఉపయోగించండి. వీటిని ప్రతి 3 గంటలకు ఒకసారి పెదాలకు అప్లై చేయండి. పగిలిన పెదాలను లేదా చర్మాన్ని తేమగా మార్చడానికి లిప్ సన్ స్క్రీన్ తో పాటుగా చక్కెర, తేనె లేదా నారింజ తొక్క వంటి సహజ ఉత్పత్తులతో వాటిని ఎక్స్ఫోలియేట్ చేయండి.
 

68

నీటిని పుష్కలంగా తాగండి

పర్యావరణ కాలుష్యం, పొడి గాలులు వంటి వివిధ కారణాల వల్ల మన శరీరంతో పాటుగా పెదవులు కూడా పొడిగా, పగిలిపోతుంటాయి. ముఖ్యంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోతే పెదాలు పగిలిపోతుంటాయి. అందుకే పెదాలను తేమగా ఉంచడానికి నీటిని పుష్కలంగా తాగాలి. సీజన్లతో సంబంధం లేకుండా ఏ కాలమైనా.. ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. 
 

78

మీ పెదాలను నాలుకతో అద్దడం మానేయండి

కొంతమంది మంది పెదాలను ఎప్పుడూ.. నాలుకతో అద్దడం లేదా కొరకడం లాంటివి చేస్తుంటారు. ముఖ్యంగా పెదవులు పొడిగా ఉన్నప్పుడు తరచుగా నాలుకతో అద్దుతుంటారు. కానీ పెదాలపై లాలాజలం ఎండిపోయినప్పుడు మీ పెదవులు మరింత ఎండిపోతాయి. ఇది పెదవుల హైపర్పిగ్మెంటేషన్ కు కూడా దారితీస్తుంది. మీ పెదాలను నాకడానికి బదులుగా లిప్ బామ్ ఉపయోగించండి.
 

88

నెయ్యిని ఉపయోగించండి

నెయ్యి మీ పెదాలను తక్షణమే తేమగా మారుస్తుంది. నెయ్యి మన చర్మాన్ని ఎక్కువసేపు లూబ్రికేషన్, హైడ్రేటెడ్ గా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు నెయ్యి వల్ల పెదాలు మృదువుగా మారుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories