చలికాలంలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంది.. ఈ చిట్కాలను పాటిస్తే మీరు సేఫ్..!

Published : Jan 13, 2023, 04:57 PM ISTUpdated : Jan 13, 2023, 04:58 PM IST

రక్తం గడ్డకట్టడానికి ఎన్నో కారణాలున్నాయి. కారణమేదైనా.. రక్తం గడ్డకడితే హార్మోన్ల అసమానతలు, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం నుంచి ఎన్నో ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి.   

PREV
18
 చలికాలంలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంది.. ఈ చిట్కాలను పాటిస్తే మీరు సేఫ్..!

పాలిసిథెమియా వెరా వంటి రక్తం గడ్డకట్టడాన్ని ప్రభావితం చేసే పరిస్థితుల వల్ల చిక్కటి రక్తం లేదా హైపర్‌కోగ్యులబిలిటీ ఏర్పడవచ్చు. మందులు, జీవనశైలి.. రక్తం గడ్డకట్టడంతో పాటుగా ఇతర సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. రక్తం మందంగా ఉన్నప్పుడు.. శరీరమంతా ఆక్సిజన్ సరిగ్గా అందదు. అలాగే హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. పోషకాల కదలికకు ఆటంకం కలుగుతుంది. ఇది కణజాలాలు, కణాలకు రాకుండా నిరోధిస్తుంది. ఇది కణాలలో తక్కువ ఆక్సిజన్ స్థాయికి కారణమవుతుంది. హార్మోన్ల, పోషక లోపాలకు కూడా దారితీస్తుంది.
 

28

మందపాటి రక్తం లక్షణాలు

రక్తం గడ్డకట్టే వరకు చాలా మందికి మందపాటి రక్తం లక్షణాలను గమనించలేరు. సాధారణంగా సిరలల్లోనే రక్తం గడ్డకడుతుంది. ఇది నొప్పిని కలిగిస్తుంది. గడ్డకట్టే ప్రాంతంలో, దాని చుట్టుపక్కల రక్తప్రసరణను ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు ఇలా ఉంటాయి.. 
 

38

అధిక ఋతుస్రావం
కళ్లు తిరగడం
దృష్టి మసకబారడం
సులభంగా గాయాలు కావడం
తలనొప్పి
అధిక రక్తపోటు
చర్మం దురద పెట్టడం
శక్తి లేకపోవడం
శ్వాస ఆడకపోవడం

48

రక్తం పలుచబడటానికి కొన్ని చిట్కాలు 

అల్లం

అల్లం కూడా సాలిసైలేట్‌ను కలిగి ఉంటుంది. అలాగే రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఔషధాన్ని తయారు చేయడానికి ఉపయోగించే ఎసిటైల్సాలిసిలిక్ యాసిడ్, సాలిసైలేట్ నుంచి కృత్రిమంగా తీసుకోబడింది. ఇది స్ట్రోక్, గుండెపోటును నివారించడానికి సహాయపడుతుంది.

58

పసుపు

పసుపులో కర్కుమిన్ అని పిలువబడే క్రియాశీల సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి రక్త ప్లేట్లెట్లపై పనిచేస్తుంది. దీని ఔషధ గుణాలు రక్తం గడ్డకట్టడం వల్ల కలిగే నొప్పిని నయం చేయడానికి కూడా సహాయపడతాయి.
 

68

వెల్లుల్లి

వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి. ప్రభావవంతమైన ఫలితాల కోసం ఉదయం ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తినండి. వెల్లుల్లి ధమనుల మృదువైన కండరాలపై పనిచేస్తుంది. ఇవి విశ్రాంతి తీసుకోవడానికి, రక్తం గడ్డకుండా నివారించడానికి సహాయపడతాయి. వెల్లుల్లి రక్తపోటును కూడా తగ్గిస్తుంది. 
 

 

78
Image: Getty Images

దాల్చినచెక్క

దాల్చినచెక్కలో coumarin అనే శక్తివంతమైన ఏజెంట్ ఉంటుంది. ఇది రక్తం సన్నబడటానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.  వార్ఫరిన్ అనేది సాధారణంగా రక్తం సన్నబడటానికి ఉపయోగించే మందును coumarin నుంచి తీసుకుంటారు. 2012 ఫార్మాకోగ్నోసీ రీసెర్చ్ ప్రకారం.. చైనీస్ కాసియా దాల్చినచెక్కలో సిలోన్ దాల్చినచెక్క కంటే చాలా ఎక్కువ coumarin కంటెంట్ ఉంటుంది. అయినప్పటికీ.. coumarin అధికంగా ఉండే దాల్చినచెక్కను దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది.
 

88

అవిసె గింజలు, చియా విత్తనాలు

ఈ చిన్న విత్తనాల్లో ఆరోగ్యకరమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అవిసె గింజలు ప్లేట్లెట్లను, గడ్డకట్టడంలో పాల్గొనే రక్త కణాలను తక్కువ అంటుకునేలా చేస్తాయని నిపుణులు చెబుతారు. వాస్తవానికి ఈ విత్తనాలు ధమనులను గట్టిపడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చియా విత్తనాలు సహజంగా రక్తం పలుచబటానికి  ప్రసిద్ది చెందాయి. ఇవి మన శరీరానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా దీనిలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.

 

Read more Photos on
click me!

Recommended Stories