Popcorn : పాప్ కార్న్ తింటే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు..!

Published : Apr 26, 2022, 01:11 PM IST

Popcorn : పాప్ కార్న్ ను ఎక్కువగా తినడం వల్ల డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే దీన్ని తినడం వల్ల అధిక బరువును కూడా కోల్పోతారు. దీనిలో ఉండే ఫైబర్ వల్ల మనం తీసుకున్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.  

PREV
110
Popcorn : పాప్ కార్న్ తింటే ఏమౌతుందో తెలిస్తే  షాక్ అవుతారు..!

Popcorn : పాప్ కార్న్ ను ఇష్టపడని వారు ఎవరూ లేరేమో కదా. మొక్కజొన్నలతో తయారైన పాప్ కార్న్ ను చిన్నల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటూ ఉంటారు. ఫ్రెండ్స్ తో సరదాగా బయటకు వెళ్లినప్పుడు, సినిమాకు వెళ్లినప్పుడు పక్కాగా వీటిని తింటూ ఉంటారు. మొక్కజొన్న గింజలను కాస్త నూనెలో వేయించడం వల్ల పాప్ కార్న్ లు తయారవుతాయి. నిజానికి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

210
popcorn

కానీ వీటిలో నెయ్యి, ఉప్పు మాత్రం వేయకూడదు. ఇలా వేసిన పాప్ కార్న్ లను తింటే మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. 

310

పాప్ కార్న్ లో విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 

410

పాప్ కార్న్ లో ఉండే ఫైబర్ రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. అలాగే ఇన్సులిన్ లెవెల్స్ ను రిలీజ్ చేస్తుంది. మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా చేయడానికి పాప్ కార్న్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

510

అంతేకాదు వీటిలో ఉండే ఫైబర్ వల్ల మనం తీసుకున్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. మధుమేహులకు ఫైబర్ ఫుడ్స్ చాలా అవసరం. కాబట్టి వీరు పాప్ కార్న్ ను బేషుగ్గా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. 
 

610

జీర్ణక్రియ పనితీరును మెరుగుపరిచే జెర్మ్, ఎండోస్పెర్మ్ వంటివి పాప్ కార్న్ లో పుష్కలంగా ఉంటాయి. పేగుల ఆరోగ్యానికి ఫైబర్ ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇది మలబద్దకం సమస్యను కూడా తొలగిస్తుంది. 

710
popcorn

పాప్ కార్న్ లో ఉండే ఫైబర్ ధమనులకు, రక్తనాళాల గోడలకు పేరుకుపోయిన అదనపు కొవ్వులను కూడా కరిగిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు తగ్గుతాయి. 

810
popcorn

పాప్ కార్న్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి సహాయపడతాయి. 

910

పాప్ కార్న్ లో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది.  పాప్ కార్న్ ను తినడం వల్ల అధిక బరువు నుంచి ఈజీగా బయటపడొచ్చు. అంతేకాదు దీనిని తినడం వల్ల కండరాల బలహీనత, అంధత్వం, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు తగ్గుతాయి. 
 

1010

ఎముకలను ఆరోగ్యంగా ఉంచే మాంగనీస్ పాప్ కార్న్ లో పుష్కలంగా ఉంటుంది. ఈ మాంగనీస్ వల్ల కీళ్ల నొప్పులు, బోలు ఎముకల వ్యాధి, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని తినడం వల్ల ఐరన్ కూడా లభిస్తుంది.   
 

Read more Photos on
click me!

Recommended Stories