భోజనం తర్వాత అరటి పండును తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

Published : Jan 17, 2023, 01:56 PM IST

మలబద్దకం, గ్యాస్, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, వికారం జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసే కొన్ని ప్రధాన సమస్యలు. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి.   

PREV
17
 భోజనం తర్వాత అరటి పండును తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?
banana

మన దైనందిన జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటాం. వీటిలో జీర్ణ సమస్యలు ఎక్కువ మందిని ఇబ్బందిపెడుతుంటాయి. ఈ రోజుల్లో జీర్ణ సమస్యలు అత్యంత సాధారణ సమస్యల్లో ఒకటిగా మారిపోయాయి. అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగానే చాలా మంది జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
 

27

గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, వికారం జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసే కొన్ని ప్రధాన సమస్యలు. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ సమస్యలు మనకు ఎన్నో విధాలా హాని కలిగిస్తాయి. 
 

37

మీరు తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం, సకాలంలో నిద్రపోయేలా చూసుకోవడం, ప్రతిరోజూ ఏదైనా శారీరక కార్యకలాపాలు లేదా వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయడం ద్వారా జీర్ణ సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం నుంచి బయటపడటానికి కొన్ని సింపుల్ చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

47
banana

జీర్ణ సమస్యలను తగ్గించడంలో అరటిపండు బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఫుడ్ ను తిన్న తర్వాత అరటిపండు తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో చిటికెడు నల్ల మిరియాల పొడి, ఉప్పును చల్లి తినండి.  జీర్ణక్రియను సులభతరం చేయడానికి, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి ఫైబర్ కంటెంట్ చాలా సహాయపడుతుంది. కాగా అరటిపండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

57

అంతేకాకుండా అరటి పండ్లలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం సమస్యను నివారించడంలో పొటాషియం ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మందికి సోడియం కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.  అయితే అరటి పండ్లు ఈ సమస్యను తొందరగా తగ్గిస్తాయి. 
 

67

చిలగడదుంపలు, పెరుగు, కేఫీర్, కూరగాయలు, పండ్లు, మూలికా టీలు, జీలకర్ర నీరు వంటి అనేక ఆహారాలు, పానీయాలు మలబద్దకాన్ని నివారించడానికి బాగా సహాయపడతాయి. జీర్ణ సమస్యను పరిష్కరించడానికి  ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్నిఎక్కువగా తీసుకోవాలి. 
 

77

జీర్ణ సమస్యలు తగ్గడానికి కేవలం ఆహారంపైనే దృష్టి పెడితే సరిపోదు. ఇంతకు ముందు చెప్పినట్లుగా.. కంటినిండా నిద్ర, శారీరక శ్రమ కూడా అవసరం. నిశ్చల జీవనశైలి, శారీరక శ్రమ లేని జీవనశైలి, ఒత్తిడి , నిద్రలేమి లేదా క్రమరహిత నిద్ర ఇవన్నీ ఉబ్బరం, మలబద్దకానికి దారితీస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories