
Health Tips: పెరుగు (Yogurt)మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఇది మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది కూడా. అందుకే వేసవి (Summer)లో పెరుగును అలాగే లేదా మజ్జిగ (Buttermilk)చేసుకుని తాగుతుంటారు. వాస్తవానికి పెరుగులో ఉండే ఔషదగుణాలు శరీరాన్ని కూల్ గా ఉంచడమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కూడా కాపాడుతుంది.
పెరుగులో కాల్షియం (Calcium)ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన ఎముకలను (Bones), దంతాలను (Teeth) బలంగా చేస్తుంది. అలాగే దీనిలో లాక్టోస్, భాస్వరం కూడా ఉంటుంది.
పెరుగులో కొద్దిగా బెల్లం, మిరియాల పొడిని కలుపుని తింటే జలుబు (Cold) తొందరగా వదిలి పోతుంది. అంతేకాదు పెరుగు కఫం, వాతం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇక పెరుగులో కొద్దిగా చెక్కర (sugar)ను కలుపుకుని తింటే ఎంతో మంచి జరుగుతుంది. ముఖ్యంగా మూత్రాశయ (Bladder) సమస్యలు తగ్గడంతో పాటుగా, శరీరానికి తక్షణ శక్తి కూడా లభిస్తుంది.
ఈ పెరుగులో షుగర్ కు బదులుగా బెల్లాన్ని (Jaggery) కలుపుకుని తినడం వల్ల అల్సర్ (Ulcer)సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఇకపోతే పెరుగులో కాస్త తేనెను కలుపుని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ (Infections) తొందరగా తగ్గుతాయి.
పెరుగులో కొద్దిగా వామును కలిపి తీసుకుంటే నోటిపూత (Mouth ulcers),దంత సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. కాగా పెరుగు కండరాలను కూడా బలంగా తయారుచేస్తుంది. ఇందుకోసం పెరుగులో ఓట్స్ (oats) ను మిక్స్ చేసి తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి ప్రోటీన్లు, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉందుతాయి. దీంతో కండరాలు బలోపేతం అవుతాయి.
మండుతున్న ఎండలకు శరీరం నుంచి చెమట రూపంలో నీరంతా బయటకు పోతుంది. దీంతో మీరు డీహైడ్రేషన్ (Dehydration) బారిన పడొచ్చు. డీహైడ్రేషన్ వల్ల అలసట, నిసత్తువ, శక్తిలేకపవడం వంటి సమస్యలతో పాటుగా ప్రాణాల మీదికి కూడా రావొచ్చు. ఇలా కాకూడదంటే .. ఈ సీజన్ లో మజ్జిగను తాగాలి. మజ్జిగ బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.
అధిక రక్తపోటు పేషెంట్లకు కూడా మజ్జిగ చక్కటి మేలు చేస్తుంది. వీళ్లు ప్రతిరోజూ ఒక కప్పుడు పెరుగును తింటే హైబీపీ సమస్య నియంత్రణలోకి వస్తుంది. పెరుగు గుండె సంబంధిత రోగాల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. అలాగే విరేచనాల సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం పెరుగులో కొన్ని మెంతులను కలుపుని తినాలి.
ఇకపోతే పెరుగులో ఎండుద్రాక్ష పండ్లను మిక్స్ చేసి తీసుకుంటే పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత, కౌంట్ బాగా పెరుగుతుందని పలు సర్వేలు ఇప్పటికే వెళ్లడించాయి. పెరుగును తినడం వల్ల కలిగే దుష్ఫ్రభావాలు.. పెరుగు ఆస్తమా (Asthma) రోగులకు అస్సలు మంచిది కాదు. వీళ్లు పెరుగును తింటే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
అలాగే జలుబు సమస్య ఉన్న వాళ్లు కూడా పెరుగుకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట. పెరుగును రాత్రి పూట తినడం వల్ల ఫ్లూ తీవ్రతరం అవడంతో పాటుగా జలుబు మరింత ఎక్కువ అవుతుంది. ఇకపోతే బరువు తగ్గాలనుకునే వారు కూడా పెరుగుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెరుగులో షుగర్ ను కలుపుకుని తింటే బరువు తగ్గడానికి బదులుగా విపరీతంగా బరువు పెరుగుతారు.
ఆర్థరైటిస్ సమస్య ఉన్న వాళ్లు కూడా పెరుగును తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది ఈ సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది.
రెగ్యులర్ గా పెరుగును తింటే అధిక రక్తపోటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి మంచిదని పెరుగును ఇష్టారీతిలో తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయ ప్రకారం.. భోజనం చేసేటప్పుడు తెల్ల పెరుగును తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా పెరుగులో ఉప్పును మిక్స్ చేసి తీసుకుంటే శరీరానికి హానీ జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే చర్మ వ్యాధులుు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.