చలికాలంలో తెల్లారకముందే నిద్రలేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | Feb 4, 2024, 9:47 AM IST

కాలాలతో సంబంధం లేకుండా కొంతమంది తెల్లారకముందే నిద్రలేస్తుంటారు. దీనివల్ల పనులన్నీ తొందరగా అయిపోతాయి. కానీ ఇలా నిద్రలేవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
 

కొంతమందికి చలికాలంలో కూడా తెల్లారకముందే నిద్రలేచే అలవాటు ఉంటుంది. ఇలా తెల్లారకముందే లేచి ఇంటిపనులన్నింటినీ కంప్లీట్ చేసుకుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును చలికాలంలో మీరు ఉదయాన్నే ఎంత త్వరగా మేల్కొంటే.. మీ ఆరోగ్యం అంత ఎక్కువగా ప్రభావితమవుతుందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

wake up

సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది 

చలికాలంలో తెల్లారకముందే నిద్రలేవడం వల్ల మీపై ఉదయపు సూర్యరశ్మి పడదు. కానీ దీనివల్ల మీలో విటమిన్ డి లోపిస్తుంది. ఈ లోపం సెరోటోనిన్, మెలటోనిన్ ను ప్రభావితం చేస్తుంది, ఇది నిద్ర సమస్యలకు దారితీస్తుంది.
 


ఎనర్జీ తక్కువగా ఉంటుంది

చలిలో ఉదయాన్నే నిద్రలేవాలంటే మీక వేడి అవసరం. దీని వల్ల శరీరానికి ఎక్కువ శక్తి అందుతుంది. మీరు చలికాలంలో తెల్లారకముందే నిద్రలేస్తే సూర్యరశ్మి వేడి మీపై పడదు. దీంతో మీ బాడీ చల్లగా అయిపోతుంది. దీనివల్ల మీ శక్తి తగ్గుతుంది. 
 

సిర్కాడియన్ రిథమ్ క్షీణత 

చలికాలంలో ఉదయాన్నే  నిద్రలేవడం వల్ల సహజ సిర్కాడియన్ లయకు భంగం కలుగుతుంది. ఎందుకంటే చలికాలంలో తెల్లవారు జామున పొగ మంచు కురవడంతో పాటుగా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇది ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.

wake up

రిస్క్ లో ఉంటారు

సిర్కాడియన్ లయ క్షీణత.. మీ మానసిక స్థితి, మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది సున్నితమైన వ్యక్తులకు కాలానుగుణ వ్యాధులొచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. దీనివల్ల మీరు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడతారు. 
 

wake up in morning

చల్లగాలుల ప్రభావం

చలికాలంలో ఉదయాన్నే లేవడం వల్ల మీరు చల్లని ఉష్ణోగ్రతలకు గురువుతారు. ఇది ఫ్రాస్ట్బైట్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటుగా జలుబు వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.ఇది ఎన్నో రోగాలకు కారణమవుతుంది.
 

ఆరోగ్య సమస్యలు 

చిలికాలంలో ఉదయం ఎక్కువ సేపు చల్లని వాతావరణంలో ఉండటం వల్ల మీ గుండె సంబంధిత వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల మీ గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఇప్పటికే గుండె ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది అస్సలు మంచిది కాదు.

Latest Videos

click me!