ఉరకల పరుగుల ఈ జీవితంలో మన రోజువారీ పనులన్నీ చాలా వేగంగా అయిపోవాలి. అలా అవ్వాలంటే ఏదో ఒక వెహికల్ తప్పనిసరి. కారు అయితే పెద్ద సమస్యలు ఉండవు కాని, బైక్ అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వెన్నెముక, కండరాలకు సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అవేంటంటే..
స్పాండిలోసిస్
బ్యాక్ సపోర్ట్ లేకుండా ఎక్కువ సేపు బైక్ నడపడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా స్పాండిలోసిస్ (Spondylosis) లేదా డిస్క్ సమస్యలు రావచ్చు. దీనికి రోడ్డు కూడా మరో కారణం కావచ్చు. గుంతలు, రాళ్లు ఉన్న రోడ్డుపై రోజూ ప్రయాణించడం వల్ల డిస్క్ సమస్యలు వస్తాయి. డిస్క్ పక్కకు జరగడం, అరిగిపోవడం జరుగుతుంది.