గరం మసాలా తింటే జరిగేది ఇదే..!

First Published Jul 7, 2024, 1:02 PM IST

గరం మసాలాను చికెన్, మటన్, ఫిష్ కర్రీతో పాటుగా ఎన్నో వంటకాల్లో వేస్తుంటాం. ఇది వంటల రుచిని పెంచుతుంది. ఇది అందరికీ తెలుసు. కానీ గరం మసాల మనకు చేసే మేలు గురించి మాత్రం ఎవ్వరికీ తెలయదు. అసలు గరం మసాలాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? 

గరం మసాలాను వెజ్ లేదా నాన్ వెజ్ అంటూ తేడా లేకుండా దాదాపుగా అన్ని రకాల కూరల్లో వేస్తుంటారు. కొంతమంది ఇంట్లో తయారుచేసిన గరం మసాలాను ఉపయోగిస్తే.. మరికొంతమంది మార్కెట్ లో కొన్న వాటిని ఉపయోగిస్తారు. కానీ ఈ గరం మసాలా మాత్రం ఫుడ్ టేస్ట్ ను అదరహో అనిపిస్తుంది. నిజానికి ఇది వంటలను రుచికరంగా చేయడమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, నల్ల మిరియాలు, జాజికాయ, బిర్యానీ ఆకులు మొదలైన వాటితో తయారుచేసిన గరం మసాలాను ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


జీర్ణక్రియకు మేలు 

మన ఆహారంలో గరం మసాలా వేయడం వల్ల మన జీర్ణవ్యవస్థకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మీకు అపానవాయువు (పిత్తులు) సమస్య ఉంటే మీ ఆహారంలో గరం మసాలాను తప్పకుండా చేర్చండి. ఎందుకంటే ఇది ఆకలిని పెంచుతుంది. అలాగే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఇది అపానయవాయువు నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది.

Latest Videos


యాంటీఆక్సిడెంట్లు 

గరం మసాలాలో ఎన్నో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఈ గరం మసాలా మీరు ఎన్నో వ్యాధులతో పోరాడటానికి మీకు సహాయపడుతుంది. శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 

garam-masala

జీవక్రియ

గరం మసాలా మెటబాలిజంను పెంచడానికి కూడా సహాయపడుతుంది. గరం మసాలాలో ఉండే నల్ల మిరియాలు, లవంగాలు, జీలకర్ర మీ శరీరంలోని ఎన్నో అవయవాలకు మేలు చేయడంతో పాటుగా శరీరంలోని ఎన్నో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాల లోపాన్ని కూడా తగ్గిస్తాయి.

garam masala


రోగనిరోధక శక్తి

మారుతున్న వాతావరణం వల్ల మన శరీర రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అయితే గరం మసాలా మీ శరీర రోగనిరోధక శక్తిని బలంగా మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు రాకుండా మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గరం మసాలాను తింటే దగ్గు, జలుబు వచ్చే అవకాశమే ఉండదు. 


బరువు తగ్గడానికి

గరం మసాలా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. గరం మసాలాను మీ ఆహారంలో చేర్చడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే మీ ఆహారంలో గరం మసాలాను ఖచ్చితంగా చేర్చండి. దీనివల్ల మీరు బరువు తగ్గడంతో పాటు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా తగ్గుతాయి. 
 

click me!