kiwi
కివి పండ్లు పోషకాల భాండాగారం. ఈ పండ్లను న్యూజిలాండ్ తో సహా ప్రపంచంలోని ప్రసిద్ద ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తారు. కివిలల్లో కాపర్, పొటాషియం, ఫోలేట్, విటమిన్ కె, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో కొవ్వులో పోషకాలు కూడా ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అలాగే రోగనిరోధక వ్యస్థను బలపరిచే లక్షణాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. దీనిలో కేలరీలు, ప్రోటీన్, కొవ్వు తక్కువగా ఉంటాయి. దీనిలో మంచి మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కివీలు తీపి, టార్ట్ రుచిని కలిగి ఉంటాయి. ఈ పండును తినడం వల్ల బాడీ మొత్తం రీఫ్రెష్ అవుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కివిని శీతాకాలంలో తప్పకుండా తినాలి. ఎందుకంటే..
Image: Getty Images
ఫైబర్ కు మంచి మూలం
ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది మీకు గుండెకు సంబంధించిన ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుతుంది.
kiwi
జీర్ణక్రియకు సహాయపడుతుంది
కివి పండ్లలో ఎంజైమ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలోని ప్రోటీన్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాదు మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. మలబద్దకంతో బాధపడేవారు ఈ పండును రోజూ తింటే సమస్య నుంచి బయటపడతారు. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది కూడా.
kiwi
విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది
నిమ్మకాయలు, నారింజ, ఉసిరి లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని అందరికీ తెలుసు. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే.. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాల్లో కివి కూడా ఒకటి. ఈ పండులో దాదాపుగా 14 శాతం విటమిన్ సి ఉంటుంది. ఇది నిమ్మకాయ, నారింజ కంటె రెట్టింపు. అందుకే ఈ పండును కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగించొచ్చు. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మానికి, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది.
మంచి నిద్రకు సహాయపడుతుంది
కివి పండ్లలో సెరోటోనిన్ ఉంటుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నిద్ర నాణ్యతను పెంచుతుంది. మెదడులో సెరోటోనిన్ స్థాయిలు పెరగడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. నిద్రకూడా బాగా పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
kiwi
క్యాన్సర్ ను నివారిస్తుంది
కివిల్లో ఉండే ఫైటోకెమికల్స్, ఫైబర్ లు అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ పండును తింటే పొట్ట, పేగులు, పెద్దపేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.