చాక్లెట్స్ తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Oct 30, 2024, 4:19 PM IST

అన్ని రకాల చాక్లెట్ల సంగతి పక్కన పెడితే.. డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. రోజూ కొంచెం డార్క్ చాక్లెట్ ను తింటే ఏయే ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? 

చాలా మంది డార్క్ చాక్లెట్ ను చాలా ఇష్టంగా తింటారు. కేవలం రుచి కోసం మాత్రమే తిన్నా.. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అవును డార్క్ చాక్లెట్ ను మీరు లిమిట్ లో తింటే లెక్కలేనన్ని ప్రయోజనాలను పొందుతారు. అవేంటో మనమూ ఓ లుక్కేద్దాం పదండి. 

పోషకాలు సమృద్ధిగా..

డార్క్ చాక్లెట్ లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీనిలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దీనిలో ఇనుము, మెగ్నీషియం, ఐరన్ తో పాటుగా మాంగనీస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు మెండుగా ఉంటాయి.

ఈ డార్క్ చాక్లెట్ లో 70-85% కోకో ఉంటుంది. 100 గ్రాముల డార్క్ చాక్లెట్ బార్ లో 11 గ్రాముల ఫైబర్, ఇనుము  ఉంటాయి. ఇవి మన రోజువారి అవసరాలకు సరిపోతాయి. ఇంతేకాదు డార్క్ చాక్లెట్ లో భాస్వరం, పొటాషియం, జింక్, సెలీనియంలు కూడా ఉంటాయి. 
 

Latest Videos


శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు 

డార్క్ చాక్లెట్ లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, కాటెచిన్లతో పాటుగా మెండుగా  యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు  మన శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేయడానికి సహాయపడతాయి. ఈ ఫ్రీరాడికల్స్ మన కణాలను దెబ్బతీస్తాయి.

అలాగే శరీరంలో మంటను కలిగిస్తాయి. తొందరగా వృద్ధాప్యానికి దారితీస్తాయి. అయితే డార్క్ చాక్లెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. ఎన్నో రోగాల నుంచి మన శరీరాన్ని కాపాడుతాయి. 

గుండె ఆరోగ్యం 

డార్క్ చాక్లెట్ మన గుండెకు కూడా మంచి మేలు చేస్తుంది. ఈ చాక్లెట్లో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే అధిక రక్తపోటును తగ్గిస్తాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

అంతేకాకుండా డార్క్ చాక్లెట్ ను మితంగా తినడం వల్ల ఎండోథెలియం పనితీరు కూడా మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

మెదడు పనితీరు

డార్క్ చాక్లెట్ మన గుండెను మాత్రమే కాదు.. మన మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.  డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే జ్ఞాపకశక్తిని పెంచేందుకు సహాయపడతాయి.

అలాగే మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి మరియు అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ జబ్బులొచ్చే ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయి.
 

dark chocolate

చర్మ ఆరోగ్యం

డార్క్ చాక్లెట్ మన చర్మానికి కూడా మంచి మేలు చేస్తుంది. దీనిలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు మన చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. అలాగే చర్మానికి రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. అలాగే చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. దీంతో మీ చర్మం యవ్వనంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. 

బరువు తగ్గుతారు

అవును మీ బరువును కంట్రోల్ చేయడానికి డార్క్ చాక్లెట్ కూడా బాగా సహాయపడతుంది. డార్క్ చాక్లెట్ లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కంటెంట్ మీ కడుపును తొందరగా నింపడానికి సహాయపడతాయి. అలాగే మీరు కేలరీలు తీసుకునే మొత్తాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయి. అయినప్పటికీ కేలరీలు ఎక్కువగా తీసుకోకూడదంటే మాత్రం మీరు డార్క్ చాక్లెట్ ను కూడా లిమిట్ లోనే తినాలి. 

click me!